https://oktelugu.com/

శివసేనను ఫుట్ బాల్ ఆడుతున్న కంగనా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కాలంలో కంగనా రనౌత్ పలు సంచలన విషయాల్లో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గతంలో మహారాష్ట్రలో హిందూ సాధువులను దారుణంగా కొట్టి చంపిన విషయంలో, ఇటీవల సుశాంత్ ఆత్మహత్య కేసు విషయంలోనూ కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించింది. బాలీవుడ్ ఇండస్ట్రీపై, మహారాష్ట్ర సర్కారుపై, ముంబై పోలీసుల తీరును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2020 / 07:14 PM IST
    Follow us on

    బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కాలంలో కంగనా రనౌత్ పలు సంచలన విషయాల్లో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గతంలో మహారాష్ట్రలో హిందూ సాధువులను దారుణంగా కొట్టి చంపిన విషయంలో, ఇటీవల సుశాంత్ ఆత్మహత్య కేసు విషయంలోనూ కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించింది. బాలీవుడ్ ఇండస్ట్రీపై, మహారాష్ట్ర సర్కారుపై, ముంబై పోలీసుల తీరును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

    Also Read: సంచలన విషయాలు : సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడా..?

    దీంతో శివసేన నేతలు కంగనాను టార్గెట్ చేస్తూ మాటలయుద్ధానికి దిగారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కంగనాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కంగనా ఒక ‘హరంఖోడ్ లడ్కీ’ అని సంబోధించాడు. దీనిపై తాజాగా కంగనా ట్వీటర్లో ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    తనను ‘హరంఖోర్’ అనడం సంజయ్ రౌత్ మనస్తత్వానికి నిదర్శమని చెప్పింది. సంజయ్ రౌత్ లాంటి చెడు మనస్తత్వం ఉన్నవారి వల్లేయ దేశంలో నిత్యం అమ్మాయిలు అత్యాచారానికి గురవుతున్నారన్నారు. ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో ఆడవారికి గౌరవం లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై అసభ్యంగా మాట్లాడిని సంజయ్‌ రౌత్‌ను దేశంలోని ఆడబిడ్డలు క్షమించారని చెప్పుకొచ్చింది. గతంలో అమీర్ ఖాన్.. నసీరుద్దిన్ షాలు ఈ దేశంలో ఉండాలంటే భయం వేస్తుందని చెప్పినపుడు సంజయ్ వారికి హరంఖోర్ అని ఎందుకు అనలేదని ప్రశ్నించింది.

    Also Read: ‘బిగ్ బాస్ సీజన్ 4’ కంటెస్టెంట్స్ వీళ్ళే !

    ఇక తానెప్పుడూ కూడా మహారాష్ట్రపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పింది. హిందూ సాధువులను దారుణంగా కొట్టి చంపుతున్నా ముంబై పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడాన్నే తప్పుబట్టినట్లు చెప్పారు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసు విషయంలో ముంబై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందు వల్లే వారికి మార్యద ఇవ్వలేదని స్పష్టం చేశారు.

    ఇక తాను ముంబై వస్తే కొట్టి చంపుతామంటూ కొందరు బెదిరిస్తున్నారని.. ముంబై ఏమీ సంజయ్ రౌత్ కాదని తేల్చిచెప్పింది. తాను ఈనెల 9న ముంబైకి వస్తున్నానని.. ఎవరూ తనను ఆపుతారో తేల్చుకుందామంటూ సవాల్ విసిరింది. దీంతో ఆరోజు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం కంగనా రనౌత్ ట్వీటర్లో పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది.