Meat – Rainy Season : మనం మాంసాహార ప్రియులం. మాంసం లేనిదే ముద్ద దిగని వారు చాలా మంది ఉన్నారు. అయితే సీజన్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో నాన్ వెజ్ అంత మంచిది కాదు. ఒకవేళ తిన్నా సరిగా జీర్ణం కాదు. దీంతో సమస్యలొస్తాయి. అందుకే నాన్ వెజ్ కు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. వైద్య శాస్త్రం ప్రకారం వర్షాకాలంలో మాంసాహారం తినడం మంచిది కాదు. జీర్ణ వ్యవస్త సరిగా పనిచేయదు. దీంతో మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవడమే బెటర్.
బ్యాక్టీరియా
వర్షాకాలంలో మాంసాహారం తినడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఈ కాలంలో చేపలు ఎక్కువగా దొరుకుతాయి. కానీ చేపలకు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో అవి గుడ్లు పెడతాయి. దీంతో వాటి శరీరంలో మార్పులు వస్తాయి. ఈ సమయంలో వాటిని తినడం వల్ల బ్యాక్టీరియా మన శరీరానికి అంటుకునే అవకాశం ఉంటుంది. అందుకే వాటి జోలికి వెళ్లడం అంత మంచిది కాదు.
పరీక్షించిన తరువాతే..
కచ్చితంగా తినాలని అనిపిస్తే కొనేటప్పుడు పరిశీలించి తీసుకోవాలి. బొప్పలన చూసి కొనుక్కోవాలి. కోడిగుడ్లను కూడా తినేముందు పరీక్షించుకోవాలి. నీలం గట్టిగా ఉంటేనే మంది. లేదంటే అది కూడా పాడైనట్లే. చికెన్ తీసుకునే ముందు కూడా చూడాలి. దాని చర్మం మీద మచ్చలు, గీతలు వంటివి ఉంటే అది మంచిది కాదని తెలుసుకుని తీసుకోవద్దు.
అనారోగ్యాలు దరిచేరకుండా..
పాడైన చికెన్ తింటే ఇన్ఫెక్షన్ రావడం ఖాయం. మాంసాహారం ఇంటికి తెచ్చాక వేడి నీళ్లలో శుభ్రం చేసి ఉప్పు, పసుపు వేసుకుని కడుక్కోవాలి. లేదంటే అనారోగ్యాలు దరిచేరతాయి. వానకాలం మాంసాహారానికి దూరంగా ఉంటేనే మంచిది. కానీ జిహ్వ చాపల్యంతో అలా ఉండలేని వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. రోగాలు రాకుండా ఉంచుకోవచ్చు.