Unhealthy Symptoms : ఈ లక్షణాలు ఉన్నట్లయితే మీరు ఆరోగ్యంగా లేనట్లే?

మన మూత్రం చిక్కగా, పలుచగా వస్తుంటే ఆరోగ్యంగా లేరని అర్థం. నిద్ర లేచిన తరువాత నోటి నుంచి దుర్వాసన వస్తే కూడా ఆరోగ్యం దెబ్బతిన్నట్లే.

Written By: Srinivas, Updated On : July 21, 2023 9:26 pm
Follow us on

Unhealthy Symptoms : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఆరోగ్యంగా లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అనారోగ్యం దరిచేరితే ఆస్పత్రుల చుట్టు తిరగాలి. డబ్బులు ఖర్చు పెట్టాలి. అయినా జబ్బు తగ్గకపోతే చాలా సమస్యలొస్తాయి. దీంతో కుటుంబం మొత్తం ఆందోళన పడుతుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పరచుకోవాలి. అప్పుడే మనకు బాధలు లేకుండా ఉంటాయి. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలు. రోగం వచ్చాక కష్టాలు పడే కంటే ఆ రోగాలే రాకుండా చూసుకోవడం మంచిది.

ఈ లక్షణాలుంటే..

మన మూత్రం చిక్కగా, పలుచగా వస్తుంటే ఆరోగ్యంగా లేరని అర్థం. ఎండలో వెళ్లినప్పుడు శరీరంలో చుర్రుమని అనిపిస్తుంటే మన ఆరోగ్యం సరిగా లేదని తెలుసుకోవాలి. మూత్రానికి వెళ్లినప్పుడు దుర్వాసన వస్తే కూడా ఆరోగ్యంగా లేమని అర్థం. నిద్ర లేచిన తరువాత నోటి నుంచి దుర్వాసన వస్తే కూడా ఆరోగ్యం దెబ్బతిన్నట్లే. నాలుక మీద పాచి పేరుకుపోతే కూడా అంతే.

స్నానం చేసిన..

స్నానం చేసిన రెండు మూడు గంటల్లోనే చర్మం నుంచి దుర్వాసన వస్తుంటే, కడుపు నొప్పి వస్తుంటే ఆరోగ్యంగా లేమని అనుకోవాలి. ఇందులో ఏ లక్షణం కనిపించినా మన ఆరోగ్యం మన చేతుల్లో లేనట్లే లెక్క. ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. లేదంటే ఇక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే. మనిషికి నిద్ర కూడా చాల ముఖ్యం.

ఇంకా ఏం చేయాలి

రోజుకు కచ్చితంగా 8 గంటలు నిద్ర పోవాలి. ఒత్తిడి దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు పట్టించుకోవద్దు. తాజా కూరగాయలు, పండ్లు వంటివి తీసుకోవడం ఉత్తమం. మంచినీళ్లు బాగా తాగాలి. వ్యాయామం చేయాలి. యోగా చేస్తే ఇంకా మంచిది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మన వశం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.