https://oktelugu.com/

Sweet Melon : రక్తనాళాలను శుభ్రం చేసే పండు ఏదో తెలుసా?

కర్బూజలో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. అసలు బీపీని రానివ్వకుండా చేస్తుంది. రక్తనాళాలను కడిగేస్తుంది. శరీరాన్ని మొత్తం శుభ్రం చేస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 21, 2023 9:10 pm
    Follow us on

    Sweet Melon  : కర్బూజ పండులో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. దీన్ని ఎండాకాలంలో ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఉండే నీటి శాతం మనకు ఆరోగ్యాన్నిస్తుంది. కర్బూజాలను జ్యూస్ రూపంలో లేదా ఘనపదార్థంగా తిన్నా డీ హైడ్రేషన్ ను నివారించుకోవచ్చ. దీన్ని స్వీట్ మెలన్ అంటారు. ఇది తాజాదనాన్ని ఇస్తుంది. వివిధ రకాల పోషకాలు అందించడంలో దోహదపడుతుంది.

    పొటాషియం

    ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఫైబర్ కంటెంట్ వల్ల రక్తపోటు కంట్రోల్ లో ఉండేందుకు సాయపడుతుంది. దీన్ని ముక్కలుగా కోసుకుని సాయంత్రం స్నాక్ లా తింటే చాలా లాభాలుంటాయి. ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఈ పండు తినడం వల్ల పేగుల్లో కదలికలను నియంత్రించడంలో కూడా సహకరిస్తుంది.

    డీహైడ్రేషన్

    దీనిలో 90 శాతం నీరు ఉండటం వల్ల డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది. వడదెబ్బ తగలకుండా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. కొల్లాజెన్ అనే హార్మోన్ తో ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం కల్పిస్తుంది. రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవడం ద్వారా అనేక పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. అసలు బీపీని రానివ్వకుండా చేస్తుంది. రక్తనాళాలను కడిగేస్తుంది. శరీరాన్ని మొత్తం శుభ్రం చేస్తుంది.

    వేసవికాలంలోనే..

    ఈ పండును మన ఆహారంలో చేర్చుకుంటే ఎంతో లాభం. అది కూడా దాన్ని వేసవి కాలంలో తినడమే ఉత్తమం. వర్షాకాలంలో తినొద్దు. వేసవిలోనే పుష్కలంగా తింటే మనకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్య సంరక్షణలో కర్బూజ గొప్ప గుణాన్ని కలిగి ఉంటుంది. ఇలా కర్బూజతో మనం చాలా రకాల మేలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.