Homeలైఫ్ స్టైల్WHO Warning On Nail Polish: నెయిల్ పాలిష్ వేసుకునేవారికి WHO హెచ్చరిక..

WHO Warning On Nail Polish: నెయిల్ పాలిష్ వేసుకునేవారికి WHO హెచ్చరిక..

WHO Warning On Nail Polish: అందంగా కనిపించేందుకు మహిళలు తరచూ నెయిల్ పాలిష్ వాడటం ఇప్పుడు సాధారణమైపోయింది. ఫ్యాషన్‌లో భాగంగా వివిధ రంగుల నెయిల్ పాలిష్‌లను ఉపయోగిస్తున్నప్పటికీ, వాటిలో ఉండే కొన్ని రసాయనాలు ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోజూ లేదా తరచూ నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం World Health Organization (WHO) హెచ్చరించింది. ఇంతకీ నెయిల్ పాలిష్ తో ఎలాంటి సమస్యలు ఉంటాయంటే?

నెయిల్ పాలిష్‌లలో ఫార్మాల్డిహైడ్ , టోలుయెన్ , డీబీపీ వంటి ప్రమాదకర కెమికల్స్ ఉంటాయి. వీటిని ‘టాక్సిక్ ట్రియో’ అని కూడా పిలుస్తారు. ఈ రసాయనాలు గోళ్ల అందాన్ని పెంచినా, శరీరానికి మెల్లగా హాని చేసే అవకాశముందని వైద్యులు వివరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ World Health Organization ఫార్మాల్డిహైడ్‌ను గ్రూప్-1 క్యాన్సర్ కారక పదార్థంగా వర్గీకరించింది. అంటే ఇది మనుషుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశాలు ఉన్న రసాయనంగా గుర్తించబడింది. దీర్ఘకాలంగా ఈ కెమికల్‌కు గురైతే శ్వాసకోశ సమస్యలు, కళ్లలో మంట, చర్మ అలర్జీలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

టోలుయెన్ అనే కెమికల్ ఎక్కువగా వాసన రూపంలో శరీరంలోకి వెళ్తుంది. దీని వల్ల తలనొప్పి, తల తిరగడం, అలసట, వికారం వంటి సమస్యలు రావచ్చు. అలాగే ఎక్కువ కాలం దీని ప్రభావానికి లోనైతే నాడీ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

డీబీపీ అనే రసాయనం గోళ్లపై పాలిష్ ఎక్కువకాలం నిలవడానికి ఉపయోగిస్తారు. అయితే ఇది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా గర్భిణులు మరియు చిన్నపిల్లలు ఈ కెమికల్స్‌కు ఎక్కువగా గురికాకుండా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే ప్రత్యేక సందర్భాలు, ఫంక్షన్లు లేదా వేడుకల కోసం అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేసుకొని వెంటనే తొలగించుకుంటే పెద్ద ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ నిరంతరం గోళ్లపై పాలిష్ ఉంచడం వల్ల గోళ్లు బలహీనపడటం, పసుపు రంగులోకి మారటం, పొడిబారటం వంటి సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper
Exit mobile version