Nail Polish: నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారా? అయితే ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త..

నెయిల్ పాలిష్ ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. నెయిల్ పాలిష్‌లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి చాలా హానికరం. వాటి నిరంతర, సుదీర్ఘమైన ఉపయోగం వల్ల అలెర్జీలు, వాపు, ఎరుపు వంటి చర్మ సమస్యలు వస్తాయి.

Written By: Swathi Chilukuri, Updated On : September 11, 2024 12:26 pm

Nail Polish

Follow us on

Nail Polish: చేతులు అందంగా కనిపించాలంటే నెయిల్ పాలిష్ ఉండాలి అనుకుంటారు. అందుకే నెయిల్ పాలిష్ వేసుకుంటారు. ప్రతి రంగు నెయిల్ పాలిష్ మార్కెట్‌లో లభిస్తుంది. దీంతో బట్టల కలర్‌ సహా కంప్లీట్‌ డ్రెసింగ్‌కు తగినట్టుగా నెయిల్‌ పాలిష్‌ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మగువలు. డ్రెస్ ఎలా ఉంటే నెయిల్ పాలిష్ కూడా అదే విధంగా వేసుకుంటున్నారు. ఈ రోజుల్లో నెయిల్ ఆర్ట్‌కి చాలా క్రేజ్ వచ్చేసింది కూడా. రంగురంగుల పాలిష్ లు మాత్రమే కాదు డిజైన్ లు కూడా కోరుకుంటున్నారు. చిన్న చిన్న గోర్ల మీద మంచి మంచి డిజైన్ లు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ నెయిల్ పాలిష్ మీ చేతులను అందంగా మారుస్తుందనేది ఎంత నిజమో.. మీకు అనారోగ్య సమస్యలను కూడా కలిగిస్తుందనేది అంతే నిజం అని మీకు తెలుసా.? అవును ఈ అందమైన నెయిల్ పాలిష్‌లలో ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇందులో చాలా రసాయనాలు ఉంటాయి.

నెయిల్ పాలిష్ ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. నెయిల్ పాలిష్‌లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి చాలా హానికరం. వాటి నిరంతర, సుదీర్ఘమైన ఉపయోగం వల్ల అలెర్జీలు, వాపు, ఎరుపు వంటి చర్మ సమస్యలు వస్తాయి. నెయిల్ పాలిష్ రిమూవర్లను కూడా హానికరమైన రసాయనాలతో తయారు చేస్తున్నారని తెలుస్తోంది. వీటిని ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారుతుంది. అంతేకాదు గరుకుగా కూడా మారుతుంది. చర్మం సహజ ఆయిల్‌, క్షీణత ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా వంటి ప్రమాదాలను పెంచుతుంది.

శ్వాసకోశ సమస్యలు-
నెయిల్ పాలిష్‌లో ఉండే రసాయనాలు శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. అందుకే నెయిల్ పాలిష్ వేసేటప్పుడు లేదా తొలగించేటప్పుడు మాస్క్ వేసుకోండి. నెయిల్‌ పాలిష్‌ లో ఉండే ట్రైఫినైల్ ఫాస్ఫేట్ ఊపిరితిత్తులకు హానికారం అంటున్నారు నిపుణులు. దీనివల్ల ఊపిరితిత్తులలో వాపు వస్తుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. ఆస్తమా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

బ్రెయిన్ డ్యామేజ్ –
నెయిల్ పాలిష్‌లోని టోలున్, ఫార్మాల్డిహైడ్, డైథైల్ థాలేట్ అనే కొన్ని రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఇతర భాగాల మాదిరిగా మెదడుకు చేరి మెదడు కణాలను దెబ్బతీస్తాయి. మెదడుకు రక్త ప్రసరణకు అంతరాయం కలిగిస్తాయి అంటున్నారు నిపుణులు. తీవ్రమైన తలనొప్పికి కారణం కూడా అవుతాయి. నెయిల్ పాలిష్ వల్ల చాలా మందికి వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అందుకే మీరు కాస్త ఈ నెయిల్ పాలిష్ కు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇలాంటివి వేసుకోవడం వల్ల మీ డ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిది.

గర్భిణీ స్త్రీలకు ప్రమాదం-
నెయిల్ పాలిష్‌లో ఉండే రసాయనాలు గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదకరం అని టాక్. ఎందుకంటే అవి పిండం వద్దకు చేరి.. పుట్టబోయే బిడ్డ శరీరంలో లోపాలను కలిగిస్తుంటాయి. కాబట్టి, నెయిల్ పాలిష్ వాడకాన్ని తగ్గించడం చాలా ఉత్తమం. మీరు తప్పనిసరిగా నెయిల్ పాలిష్‌ను వేసుకోవాలి అంటే.. సహజమైన నెయిల్ పాలిష్‌ని ఉపయోగించడం మంచిది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.