Chanakya NIthi : ప్రతీ వ్యక్తికి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యం. ఒక వ్యక్తి జీవితం పెళ్లికి ముందు ఒకలాగా.. పెళ్లయిన తరువాత మరోలా ఉంటుంది. వివాహం కాకముందు తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వస్తుంది. కానీ పెళ్లయిన తరువాత తనతో పాటు కుటుంబ బాధ్యతలు మోయాల్సి వస్తుంది. ఈ క్రమంలో కష్టాలు, సుఖాలు ఉంటాయి. కష్టాలను ఎదుర్కోవడానికి.. సంతోషం పంచుకోవడానికి మంచి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది యువకులు పెళ్లి అనగానే అందమైన అమ్మాయి కోసం ఎదురుచూస్తుంటారు. అమ్మాయి గుణవంతురాలా? కాదా? అని మాత్రం గుర్తించరు. అమ్మాయి అందంగా ఉంటే మాత్రమే సరిపోదు. మంచి లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి జీవితం ఆనందంగా ఉంటుంది. లేకుండా ప్రతీ విషయంలో కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వ్యక్తులు తమ భాగస్వామితో ఎలాంటి కష్టాలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని అస్సులు పెళ్లి చేసుకోవద్దని చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏవంటే?
అపర చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రానికి సంబందించి విలువైన సూత్రాలను ప్రజలకు అందించాడు. ముఖ్యంగా ఒక వ్యక్తి తన భాగస్వామిని ఎంచుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తాను జీవిత భాగస్వామిని మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి అయితేనే జీవితం సంతోషంగా ఉంటుందని, కొన్ని లక్షణాలు ఉన్న అమ్మాయి జోలికి అస్సలు వెళ్లకూడదని అంటున్నారు. ప్రస్తుతం కాలంలో అమ్మాయి గురించి అర్థం చేసుకోవడానికి చాలా మంది కొంత సమయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అమ్మాయిలో ఈ లక్షణాలు ఉన్నాయో? లేవో? తెలుసుకోవాలి.
కొంత మంది అమ్మాయిలు అందంగా ఉంటారు. కానీ ఇతర ఏ పని చేయడానికి ఇష్టపడరు. కనీసం ఇంట్లో వారికి కూడా సాయం చేయరు. తాను చదువుతో బిజీగా ఉన్నామని పదే పదే చెబుతారు. ఇలా చెప్పేవారు ఎటువంటి పనిచేయరని అర్థం. కేవలం చదువు మాత్రమే కాదు. ఇంట్లో వాళ్లకు కూడా సాయం చేసే అమ్మాయిలు పెళ్లయిన తరువాత భర్తతో పాటు పిల్లలకు సాయం చేస్తుందని అర్థం చేసుకోవాలి. అందువల్ల ఇలాంటి అమ్మాయిల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది.
పెళ్లి చేసుకునే ముందు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెబుతారు. అందువల్ల మంచి కుటుంబం నంచి వచ్చే అమ్మాయి అయితే మంచి లక్షణాలు కలిగి ఉంటుందని అంటారు. అందువల్ల ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే సమయంలో ఆ అమ్మాయికి చెందిన కుటుంబం మంచిదా? కాదా? అనేది తెలుసుకోవాలి. అయితే ఒక్కో సమయంలో కుటుంబ సభ్యుల వలె కాకుండా మంచి గుణం కూడా కలిగి ఉంటారు.
కొందరు అమ్మయిలు చాలా బద్ధకంతో కూడుకొని ఉంటారు. వీటిలో మొదటిది ఉదయం లేవడం. సూర్యోదయం ముందే నిద్రలేచే అమ్మాయి చాకచక్యంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇలాంటి అమ్మాయిలు సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని చూస్తారు. అంతేకాకుండా ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేచే అమ్మాయిలు ఏ పని చక్కగా చేయరని గుర్తుంచుకోవాలి.