https://oktelugu.com/

కరోనా వైరస్ నుంచి రక్షించే ఏకైక విటమిన్ ఇదే!

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో పాటు విటమిన్లు, జింక్ మరియు యాంటీ బయోటిక్స్ ఖచ్చితంగా ఉపయోగించాలి. కరోనా సమయంలో పౌష్టిక ఆహారంతో పాటు ప్రత్యేకంగా విటమిన్స్ ను కూడా తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని కొంతమేరకు అరికట్టవచ్చని కొన్ని అధ్యనాల్లో వెల్లడైంది. Also Read : బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే? కరోనా వైరస్ ని నివారించే విటమిన్స్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 31, 2020 / 06:20 PM IST
    Follow us on

    ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో పాటు విటమిన్లు, జింక్ మరియు యాంటీ బయోటిక్స్ ఖచ్చితంగా ఉపయోగించాలి. కరోనా సమయంలో పౌష్టిక ఆహారంతో పాటు ప్రత్యేకంగా విటమిన్స్ ను కూడా తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని కొంతమేరకు అరికట్టవచ్చని కొన్ని అధ్యనాల్లో వెల్లడైంది.

    Also Read : బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే?

    కరోనా వైరస్ ని నివారించే విటమిన్స్ లో మొదటి స్థానం విటమిన్ సి, డి, జింక్ టాబ్లెట్లకు ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విటమిన్స్ మాత్రమే కాదు మరొక విటమిన్ కూడా కరోనా వైరస్ ను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఆ విటమిన్ ఏంటి? ఎలా ఉపయోగపడుతుంది అనెడి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.

    ఆ విటమిన్ ఏంటి అంటే? విటమిన్ బి కాంప్లెక్స్. విటమిన్ బి కాంప్లెక్స్ లో దాదాపు ఎనిమిది రకాల విటమిన్లు ఉన్నాయ్. అవే బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి12. ఈ విటమిన్లు శరీరం పని తీరుకు దోహదం చేస్తాయ్. విటమిన్ బి కణాల పనితీరును, జీవక్రియ రేటును, రోగనిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిరోధక సైటో కైనిన్ స్థాయిలను తగ్గిస్తుంది.

    విటమిన్ బి శ్వాసక్రియ రేటును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైంటిస్టులు విటమిన్ బి కరోనా బాధితులకు సహాయ పడుతుందని తేల్చి చెప్పారు. విటమిన్ బి తీసుకున్న వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని కరోనాని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

    ఇక ఈ విటమిన్ బి’ని గుడ్లు, పాలు, ఆకుకూరలు, బీన్స్ వంటి వాటిలో మనం సమృద్ధిగా పొందవచ్చు.

    Also Read : వంద కోట్ల ఆఫర్ వద్దనుకున్న ‘మాస్టర్’?