కేసీఆర్ సార్.. హిందువులపై ఎందుకీ పక్షపాతం?

దశాబ్దాల కొట్లాట తర్వాత అయోధ్య రాముడు కొలువుదీరుతున్న ఆనందం దేశమంతా ఉంది. ముస్లిం అయినా కూడా మొఘల్ చక్రవర్తి వారసుడు అయోధ్య రాముడి భూమిపూజకు వెండి ఇటుకను బహూకరించాడు. దేశమంతా మత సామరస్యం వెల్లివిరుస్తున్న వేళ తెలంగాణలో మాత్రం ఒక వర్గానికి కాపాలా కాస్తూ మరో వర్గం సంప్రదాయలను తుంగలో తొక్కుతున్న తీరు సగటు హిందుత్వ వాదుల మనసులను తొలిచేస్తోంది.  దేశమంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణలో మాత్రం మరో ఎత్తు అన్న చందంగా పరిపాలన సాగుతోందన్న […]

Written By: NARESH, Updated On : September 1, 2020 11:08 am
Follow us on


దశాబ్దాల కొట్లాట తర్వాత అయోధ్య రాముడు కొలువుదీరుతున్న ఆనందం దేశమంతా ఉంది. ముస్లిం అయినా కూడా మొఘల్ చక్రవర్తి వారసుడు అయోధ్య రాముడి భూమిపూజకు వెండి ఇటుకను బహూకరించాడు. దేశమంతా మత సామరస్యం వెల్లివిరుస్తున్న వేళ తెలంగాణలో మాత్రం ఒక వర్గానికి కాపాలా కాస్తూ మరో వర్గం సంప్రదాయలను తుంగలో తొక్కుతున్న తీరు సగటు హిందుత్వ వాదుల మనసులను తొలిచేస్తోంది.  దేశమంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణలో మాత్రం మరో ఎత్తు అన్న చందంగా పరిపాలన సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాకెందుకీ శిక్ష.. మావి పండుగలు కావా అని మెజార్టీ ప్రజలు ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు.

Also Read : మీడియా రంగంలోకి బీజేపీ? ఆ రెండు చానెళ్లతో చర్చలు!

తెలంగాణలో కొలువు దీరింది ఎంఐఎం పార్టీ కాదు.. ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి. కానీ టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ‘తెలంగాణ రజాకర్ సర్కార్’గా మారిపోయిందని బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. వారి విమర్శలకు ఉదాహరణలు కూడా చూపుతున్నారు.

తెలంగాణలో కొలువుదీరిన కేసీఆర్ సర్కార్ హిందూ పండుగలకు నానా రకాల ఆంక్షలు, నిబంధనలు, కట్టుబాట్లు పెట్టి పండుగను శోభయామనంగా చేసుకోనివ్వడం లేదన్నది అందరి నుంచి వ్యక్తమవుతున్న ప్రధాన విమర్శ.. అదేంటని ప్రశ్నిస్తే.. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ నిబంధనలు అంటున్నారు. ఈ క్రమంలో ‘శ్రీరామ నవమి పండుగ నుంచి మొదలు పెడితే.. హనుమాన్ జయంతి, బోనాలు, గణేష్ చతుర్తి, నవరాత్రులను’ కూడా జరుపుకోనీయకుండా నిషేధించారు కేసీఆర్ సర్కార్. కరోనా భయానికి జనాలు కూడా సరేనని సహకరించారు. కానీ ఇప్పుడు అదే కేసీఆర్ సర్కార్.. ఇతర మతాల పండుగలకు సెక్యూరిటీ కల్పించి మరీ నిర్వహించడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కరోనా ఒక వర్గం వారికి వర్తించదా అని ఇదే ప్రజలు కేసీఆర్ సర్కారును ప్రశ్నిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ లో ‘మెహర్రం’ పండుగను ఘనంగా జరుపుకున్నారు. జరుపుకోవడాన్ని ఎవరూ ఖండించరు. మతసామరస్యంతో హిందువులు కూడా ఈ పండుగను అందరూ స్వాగతించారు. కానీ విచిత్రం ఏంటంటే.. ఈ మొహర్రం వేడుకలకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం.. ముందూ వెనుకాల పోలీస్ కాన్వాయ్ వెళుతూంటే వారి ఊరేగింపులు నిర్వహించారు. కరోనా వేళ ప్రజలు గుమిగూడే దేన్ని చేయవద్దని ఇదే తెలంగాణ సర్కార్ అల్టీమేటం జారీ చేసింది. ఈ క్రమంలోనే గణేష్ నవరాత్రులను కూడా నిషేధించింది. కానీ ఇదే మొహర్రం వేడుకలకు హైదరాబాద్ లో ప్రజలు పోటెత్తారు. తండోపతండాలు రోడ్ల మీదకు వచ్చి వేడకలు చేసుకున్నారు.

Also Read : 139మంది రేప్ కేసులో మాటమార్చిన బాధితురాలు..!