Site icon OkTelugu

బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్  కొత్త సినిమా ప్రకటన !

Breaking: Pawan Kalyan New Movie Announcement!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  తన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా పవన్ కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’, క్రిష్ చిత్రాల చేస్తోన్న పవన్, లాక్ డౌన్ తరువాత ఈ చిత్రాల షూటింగ్ ను పూర్తి చేసి  ఆ వెంటనే హరీష్ శంకర్ సినిమాను  స్టార్ట్  చేస్తాడని.. ఈ మేరకు ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాని నిర్మిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్  నుండి అధికారికంగా ఎనౌన్స్ మెంట్ వచ్చింది.
Also Read : ప్రియుడితో నయనతార ఫోటో..  మళ్లీ వైరల్ !
 
మైత్రీ మూవీ మేకర్స్  ట్వీట్  చేస్తూ.. ‘యస్.. క్రేజీ అప్ డేట్ రాబోతుంది.  సెప్టెంబర్ 2వ తేదిన సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలెంటెడ్ డైరెక్టర్  హరీష్ శంకర్ సినిమా గురించి ఫుల్  డిటైల్స్  చెప్పబోతున్నాము’ అంటూ  మైత్రీ మూవీ మేకర్స్  నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. మరి పవన్ ఫ్యాన్స్ సెప్టెంబర్ 2వ తేది కోసం ఇక ఆశగా ఎదురుచూస్తుంటారు.         
 
కాగా కరోనా మహమ్మారి పై యుద్ధంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  తన అభిమానులను ముందు నుండి అప్రమత్తం చేస్తూ.. ఫ్యాన్స్ చేత సేవా కార్యక్రమాలు కూడా చేయిస్తున్నారు. ఇక  పవర్ స్టార్ ఇటు రాజకీయాలతో పాటు  అటు సినిమాలనూ బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఏమైనా  రీఎంట్రీలోనే  రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్.. ఇప్పుడు హరీష్ సినిమాని ఎనౌన్స్ చేస్తున్నాడు. అలాగే రాబోయే రోజుల్లో  ఇంకొన్ని చిత్రాలకు సైన్ చేసే   ఆలోచనలో ఉన్నారట పవన్.
Also Read : వంద కోట్ల ఆఫర్ వద్దనుకున్న ‘మాస్టర్’?
Exit mobile version