Coils : మస్కిట్ కాయిల్స్‌లో హానికర కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల శ్వాస వ్యవస్థపై ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. ఈ పొగను పీల్చితే శ్వాస సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఆస్తమా, దగ్గు వంటివి వేధిస్తుంటాయి. ఈ పొగని పీలిస్తే ఊపిరి ఆడటం కూడా చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి, వీటిని వాడకుండా ఉండటమే మంచిది. మరికొంతమందికి ఈ పొగ అస్సలు పడదు కాబట్టి ఈ పొగ కారణంగా తలనొప్పి, మైకం, వికారం, చర్మంపై దద్దుర్లు, కంటి సమస్యలు వస్తాయి. కొందరికి ఈ పొగ వల్ల అలర్జీలు వస్తుంది. సెన్సెటీవ్ స్కిన్ ఉంటే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులకు నిలయం ఈ దోమల కాయిల్స్. ఇవి రక్తంలో కరిగుతుంది. దీంతో గుండెకి చేరి గుండె సమస్యలకు కారణం అవుతాయి. కొన్ని సార్లు అవి ప్రాణాంతకంగా మారతాయి. ఈ పొగని ఎక్కువగా పీలిస్తే చాలా సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఈ పొగ మన ఇళ్ళలో ఉన్న బట్టలు, ఇతర వాటికి కూడా చాలా త్వరగా వ్యాపించి సమస్యను మరింత పెద్దగా చేస్తాయి. సిగరెట్ పొగనే చాలా ప్రమాదకరం. దీనికంటే కూడా దోమ బిళ్లల పొగ మరింత ఎక్కువే అంటున్నారు నిపుణులు. దీని వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా వస్తాయట. ఈ మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగను పీలిస్తే బ్రెయిన్‌పై కూడా ఎఫెక్ట్ పడుతుందట.దీంతో బ్రెయిన్ పనితీరు దెబ్బతింటుంది.ఈ పొగ మనం పీల్చే గాలిని కూడా కలుషితం చేస్తుంది.
దోమలను తరిమేందుకు కాయిల్స్ వాడకండి. నేచురల్ పద్ధతులతో దోమలు దూరం చేయడం అలవాటు చేసుకోండి.ముఖ్యంగా మీ ఇంటి వద్ద చెత్త పేరుకుపోకుండా చూసుకోండి. నిల్వ నీరు అసలే ఉండవద్దు. కుదిరితే దోమ తెరలు వాడండి. సాయంత్రమవ్వగానే కిటికీలు, తలుపులు మూసి వేయాలి. శరీరాన్ని కప్పి ఉంచే బట్టలు వేసుకోవడం మర్చిపోవద్దు. దోమల బ్యాట్స్ వాడడం బెటర్.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Using coils to repel mosquitoes most dangerous
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com