Urine Abnormal Color: మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తూ ఉంటుంది. మందులు వాడినా వ్యాధి తగ్గని పక్షంలో వైద్యులు యూరిన్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తారు. మూత్ర విసర్జన సమయంలో కూడా మూత్రం రంగు మారితే అనరోగ్య సమస్యతో బాధ పడుతున్నామని గుర్తుంచుకోవాలి. మూత్ర పరీక్షల ద్వారా శరీరంలో ఉన్న వ్యాధిని సులభంగా తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
మూత్ర విసర్జన సమయంలో దుర్వాసన ఎక్కువగా వస్తే కిడ్నీ సంబంధిత సమస్యలు, మధుమేహం అయ్యే అవకాశం ఉంటుంది. మూత్రం రంగులో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. మూత్రం రంగు డార్క్ కలర్ లో ఉంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని భావించాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం, మసాలాలు ఎక్కువగా తీసుకున్నా మూత్రం డార్క్ కలర్ లో కనిపించే అవకాశం ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో వినియోగించే మందుల వల్ల కూడా మూత్రం రంగు మారే అవకాశాలు ఉంటాయి. కీమో థెరపీ మందులను వాడే వాళ్లకు మూత్రం ఆరెంజ్ కలర్ లో వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో బి విటమిన్ ఎక్కువైతే మూత్రం గ్రీన్ కలర్ లో వచ్చే అవకాశం ఉంటుంది. క్యారెట్లు, విటమిన్ సి ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నా మూత్రం లైట్ ఆరెంజ్ కలర్ లో వస్తుంది. మూత్రం ఎరుపు రంగులో వస్తే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయని భావించాలి.
కిడ్నీలో రాళ్లు, మూత్రాశయంలో ట్యూమర్లు ఏర్పడితే కూడా మూత్రం రంగు మారే అవకాశాలు అయితే ఉంటాయి. మూత్రం ముదురు గోధుమ రంగులో ఉంటే మాత్రం పచ్చకామెర్లు అయ్యే అవకాశం ఉంటుంది. మూత్ర సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం ద్వారా ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.