LIC Jeevan Labh Policy: దేశీయ బీమా దిగ్గజం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పాలసీలను అందిస్తుండగా ఈ పాలసీలలో జీవన్ లాభ్ పాలసీ కూడా ఒకటి. 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు పాలసీ టర్మ్ ఉండగా 8 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పాలసీ ద్వారా కుటుంబానికి ఆర్థిక భద్రత లభించడంతో పాటు మెచ్యూరిటీ తర్వాత భారీ మొత్తం పొందవచ్చు.
కనీసం 2 లక్షల రూపాయల నుంచి ఈ బీమా పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. గరిష్ట పరిమితి లేకపోవడం వల్ల నచ్చిన బీమా మొత్తానికి ఈ పాలసీని తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పాలసీని తీసుకోవడం ద్వారా చెల్లించిన ప్రీమియం మొత్తంపై పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందవచ్చు. 20 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు 16 సంవత్సరాల టర్మ్ తో పాలసీని తీసుకుంటే నెలకు 7,000 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
రోజుకు కేవలం 230 రూపాయలు ఆదా చేసి నెలకు 7,000 రూపాయలు చెల్లిస్తే మెచ్యూరిటీ సమయంలో 17 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. స్కీమ్ లను ఎంచుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సమీపంలోని ఎల్‌ఐసీ ఏజెంట్‌ను సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత పాలసీలను తీసుకునే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఎల్‌ఐసీ పాలసీలను తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి పాలసీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.