8 గంటలకు పైగా నిద్రపోతున్నారా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్..?

మనలో చాలామంది ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. సరైన నిద్ర ఉంటే మాత్రమే ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. మనిషికి రోజుకు సగటున 7 నుంచి 8 గంటల సమయం నిద్ర అవసరమవుతుంది. పగలంతా కష్టపడి పని చేసిన వాళ్లు రాత్రి సమయంలో రెస్ట్ తీసుకుంటే ఆ విశ్రాంతి ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడంలో తోడ్పడుతుంది. అయితే నిద్ర తక్కువైతే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయని మనందరికీ తెలిసిందే. Also Read: ఆరోగ్యకరంగా బరువు తగ్గాలా.. పాటించాల్సిన చిట్కాలివే..? నిద్ర తక్కువైతే […]

Written By: Kusuma Aggunna, Updated On : February 13, 2021 11:14 am
Follow us on

మనలో చాలామంది ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. సరైన నిద్ర ఉంటే మాత్రమే ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. మనిషికి రోజుకు సగటున 7 నుంచి 8 గంటల సమయం నిద్ర అవసరమవుతుంది. పగలంతా కష్టపడి పని చేసిన వాళ్లు రాత్రి సమయంలో రెస్ట్ తీసుకుంటే ఆ విశ్రాంతి ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడంలో తోడ్పడుతుంది. అయితే నిద్ర తక్కువైతే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయని మనందరికీ తెలిసిందే.

Also Read: ఆరోగ్యకరంగా బరువు తగ్గాలా.. పాటించాల్సిన చిట్కాలివే..?

నిద్ర తక్కువైతే ఏ విధంగా ఆరోగ్య సమస్యలు వస్తాయో నిద్ర ఎక్కువైతే కూడా అదే విధంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోతే శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పగటి పూట ఏ పని చేయనివారు రాత్రి ఎక్కువ సమయం నిద్రిస్తే వారి ఆరోగ్యంపై మరింత ఎక్కువ ప్రభావం పడుతుంది. రోజూ 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోతే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

Also Read: కళ్ల కింద నల్ల చారలు పోవాలా.. పాటించాల్సిన చిట్కాలివే..?

అధిక నిద్ర బరువును పెంచడంతో పాటు డయాబెటిస్, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. బరువు పెరిగితే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువ సమయం నిద్రపోయే వారు డిప్రెషన్ బారిన పడే అవకాశం ఉంది. వీరిలో మెదడులోని కణాలు కూడా బలహీనపడటంతో పాటు మహిళల్లో గర్భధారణ సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

ఎక్కువ సమయం నిద్రపోయే వారిలో మెదడు పనితీరు దెబ్బ తినడంతో పాటు చురుకుదనం తగ్గి మందబుద్ధి వస్తుంది. ఎక్కువ సమయం నిద్రపోయే వారికి డయాబెటిస్ ముప్పుతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.