పంచాయతీ ఎన్నికల్లో పార్టీల బలనిరూపణ

ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న పంచాయతీ పోరులో తమదే పైచేయి అంటే తమదే పైచేయి అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు బలాలను ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా వాదించుకున్నాయి. అయితే.. ఇప్పుడు ఇదే కోవాలోకి జనసేన కూడా వచ్చి చేరింది. ప్రజల్లో మార్పు కనిపిస్తోందని.. దానికి తమ పార్టీ మద్దతుదారులకు వచ్చిన ఓట్లు సీట్లే సాక్ష్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సీన్‌లోకి ఎంటర్‌‌ అయ్యారు. Also Read: టీడీపీ కంచుకోటకు బీటలు ఈ పంచాయతీ […]

Written By: Srinivas, Updated On : February 13, 2021 10:49 am
Follow us on


ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న పంచాయతీ పోరులో తమదే పైచేయి అంటే తమదే పైచేయి అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు బలాలను ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో వైసీపీ, టీడీపీలు పోటాపోటీగా వాదించుకున్నాయి. అయితే.. ఇప్పుడు ఇదే కోవాలోకి జనసేన కూడా వచ్చి చేరింది. ప్రజల్లో మార్పు కనిపిస్తోందని.. దానికి తమ పార్టీ మద్దతుదారులకు వచ్చిన ఓట్లు సీట్లే సాక్ష్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సీన్‌లోకి ఎంటర్‌‌ అయ్యారు.

Also Read: టీడీపీ కంచుకోటకు బీటలు

ఈ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతు దారులు గణనీయ సంఖ్యలో సర్పంచ్‌లుగా గెలిచారని.. కనీసం 1700 పంచాయతీల్లో రెండో స్థానంలో నిలిచారని.. ఈ లెక్కన చూస్తే తమకు పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చాయని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఆరు శాతమే వచ్చాయి. ఒక విడత పంచాయతీ ఎన్నికలే అయినప్పటికీ.. ఇదే సగటుు అంచనా వేస్తే జనసేన బలం మూడింతలు పెరిగిందని ఆయన ఆనందంతో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులు తమకు అందుబాటులో ఉండే నాయకుడినే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అక్కడ పార్టీలు పెద్దగా పని చేయవు. అయితే.. క్యాడర్ స్ట్రెంత్‌ను పంచాయతీ ఎన్నికలు నిరూపిస్తాయి. పవన్ కల్యాణ్‌ చెప్పినట్లుగా పెద్ద ఎత్తున ఓట్లు వచ్చి ఉంటే.. జనసేన పార్టీకి క్యాడర్ ఏర్పడినట్లే. ఇప్పటి వరకూ జనసేన క్యాడర్ అంటే.. కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే. ఇప్పుడు.. రాజకీయ క్యాడర్ వచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది.

అయితే.. పవన్‌ రాజకీయంగా త్యాగాలు ఎక్కువ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందంటూ ఆ పార్టీకే ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారు. దీంతో చివరికి తిరుపతి లోక్‌సభలో తామే పోటీ చేస్తామంటూ బీజేపీ బాహాటంగానే ప్రకటించేసింది. దానికి కూడా అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ బలం ఏమిటో పంచాయతీ ఎన్నికల్లో తేలిపోయింది. మొదటి విడతలో మూడు అంటే మూడు పంచాయతీలు కూడా గెల్చుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ పోటీ చేస్తే ప్రభావం చూపుతుందా.. జనసేన ఎక్కువ ప్రభావం చూపుతుందా అని లెక్కలేసుకోవాల్సిన పరిస్థితే ఉంది.

Also Read: బాబు మార్క్‌ పాలిటిక్స్‌ : ఎంతైనా అనుభవం కావాలి..!

జనసేన అధినేత రాజకీయ అడుగుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్న విషయం మాటల్లోనే వ్యక్తమవుతోంది. మరి ఆయన బలోపేతమవుతున్న పార్టీని మరింత బలోపేతం చేస్తారా లేకపోతే తన బలాన్ని.. అభిమాన బలగాన్ని బీజేపీకి మళ్లించి తాను బలహీనమవుతారా అన్నది ప్రధానమైన ప్రశ్న. ఇప్పటికే తిరుపతి సీటుపై ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ.. మున్ముందు ఏం జరగబోతోందా ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్