https://oktelugu.com/

టీడీపీ కంచుకోటకు బీటలు

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నో ఆశలతో ఈ ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలిపించి తామే మంచోళ్లమని నిరూపించుకునేందు సైకిల్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. టీడీపీ బలపర్చిన అభ్యర్థులు ఆశించిన స్థాయిలో కంటే మరీ తక్కువగా గెలుపొందడంతో ఇక తమను ప్రజలు ఆదరించడం లేదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీలో సినీయర్ నాయకుడిగా కొనసాగుతున్న దేవినేని ఉమమహేశ్వర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 13, 2021 10:19 am
    Follow us on

    TDP

    పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నో ఆశలతో ఈ ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలిపించి తామే మంచోళ్లమని నిరూపించుకునేందు సైకిల్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. టీడీపీ బలపర్చిన అభ్యర్థులు ఆశించిన స్థాయిలో కంటే మరీ తక్కువగా గెలుపొందడంతో ఇక తమను ప్రజలు ఆదరించడం లేదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

    కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీలో సినీయర్ నాయకుడిగా కొనసాగుతున్న దేవినేని ఉమమహేశ్వర్ రావుకు కోలుకోని దెబ్బ తగిలింది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఉమకు ప్రజలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో ఆయన బలపరిచిన అభ్యర్థులు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్నారట. ఓ వైపు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోసంబరాలు చేసుకుంటే ఆయన నియోజకవర్గంలో మాత్రం ముఖం చూపించకుండా జాగ్రత్తపడుతున్నారట.

    మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో 48 పంచాయతీలకు గాను 44 చోట్ల వైసీపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. టీడీపీ అభ్యర్థులు 3 చోట్ల ఇతరులకు ఓ స్థానం దక్కింది. మెరిసిమల్లి, పుల్లూరు, సీతారామపురం తండా, చంద్ర గూడెం, పాందుగల, మైలవరం చంద్రాల, గణపవరం, కీర్తిరాయని గూడెం, కనిమొర్ల తండగా తోలుకోడు, వెల్వడం, వెదురుబీడెంలో వైసీపీ విజయం సాధించింది.

    మైలవరం మండలంలోని 13 పంచాయతీల్లో 13 చోట్ల వైసీపీనే విజయకేతనం ఎగురవేసింది. ఇబ్రహీంపట్నం మండలంలో 10 పంచాయతీలకు గాను వైసీపీ 8, టీడీపీ 1, ఇతరులు 1 గెలుపొందారు. జీ కొండూరు మండలంలో 22 పంచాయతీల్లో 20 వైసీపీ, 2 చోట్లమాత్రమే టీడీపీ గెలిచింది. మొత్తంగా నియోజకవర్గాల్లో టీడీపీ మూడుచోట్ల మాత్రమే విజయం సాధించింది.

    ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తున్నదేవినేని ఉమపై ప్రజలు అసహనంతోనే ఉన్నారు. రాజధాని విషయంలో జగన్ పై ఉమ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ ఫలితాలు చూస్తే అర్థమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఎవరెన్నీ చెప్పినా జగన్ ప్రభుత్వానికే మా మద్దతు అంటూ టీడీపీకి పట్టున్న మైలవరం నియోజకవర్గ ప్రజలు తెలపడం విశేషం.