https://oktelugu.com/

Health tips : ఈ సమస్యలు ఉన్నవాళ్లు ఆపిల్ జోలికి అసలు పోవద్దు.. ముక్క తిన్నా అంతే సంగతి!

అంత మంచిది కాదు. రసాయనాలు ఉన్న ఆపిల్స్ తినడం వల్ల క్యాన్సర్ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆపిల్ లోని గింజలను కూడా తినకూడదు. వీటిలో విషం ఉంటుంది. వీటిని పొరపాటున ఒకసారి తింటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఈ గింజలు తింటే అసలు జీర్ణం కూడా కావు. కొన్ని సార్లు ఫుడ్ పాయిజన్ కి దారితీస్తుంది. అయితే ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఆపిల్ తినకూడదో మరి తెలుసుకుందాం.

Written By:
  • Srinivas
  • , Updated On : September 9, 2024 / 12:27 AM IST

    Eating Apple

    Follow us on

    Health tips :  రోజు ఒక ఆపిల్ తింటే.. డాక్టర్ అవసరం లేదని చాలా మంది అంటుంటారు. ఆపిల్ లో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని కాపాడతాయి. అయితే ఆపిల్ తినడం ఆరోగ్యానికి మంచిదే. అలా అని ఎక్కువగా తినడం అంత మంచిది కాదని వైద్య నిపుణులు అంటున్నారు. ఏ పదార్థం అయినా కూడా లిమిట్ లో మాత్రమే తినాలి. అయితే ఆరోగ్యానికి ఎంత మంచిది అయిన కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఆపిల్ పండ్లు తినకూడదు. ఇందులో కార్బోహైడ్రేట్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వెంటనే శరీరానికి శక్తిని అందిస్తాయి. సాధారణంగా ఆపిల్ తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ప్రస్తుతం చాలా మంది వీటిని రసాయనాలతో పండిస్తున్నారు. వీటిని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రసాయనాలు ఉన్న ఆపిల్స్ తినడం వల్ల క్యాన్సర్ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆపిల్ లోని గింజలను కూడా తినకూడదు. వీటిలో విషం ఉంటుంది. వీటిని పొరపాటున ఒకసారి తింటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఈ గింజలు తింటే అసలు జీర్ణం కూడా కావు. కొన్ని సార్లు ఫుడ్ పాయిజన్ కి దారితీస్తుంది. అయితే ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఆపిల్ తినకూడదో మరి తెలుసుకుందాం.

    జీర్ణ సమస్యలు
    ఆపిల్ పండ్లులో అధికంగా ఫైబర్ ఉంటుంది. వీటిని అధికంగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఫైబర్ ఆరోగ్యానికి మంచిదే. కానీ శరీరానికి కావాల్సిన దాని కంటే ఎక్కువగా ఫైబర్ తీసుకుంటే సమస్యలు తప్పవు.

    చక్కెర స్థాయిలు
    ఆపిల్ లో కార్బోహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి. వీటి వల్ల బాడీలో సెరటోనీన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల తన చక్కర స్థాయిలో అధికం అవుతాయి.

    బరువు పెరగడం
    ఎక్కువగా ఆపిల్స్ తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ వల్ల తొందరగా బరువు పెరుగుతారు. కాబట్టి తక్కువగా తీసుకోవడం మంచిది. ఊబకాయ సమస్య ఉన్నవాళ్లు ఆపిల్ కి దూరంగా ఉండటం మంచిది.

    దంతాల సమస్య
    ఆపిల్ తినడం వల్ల దంతాల సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇందులో ఉన్న ఆమ్లత్వం వల్ల తొందరగా దంతాల సమస్యలు వస్తాయి. రోజుకి ఒకటి లేదా రెండు ఆపిల్స్ మాత్రమే తినాలి. అలాగే డయాబెటిస్ ఉన్నవాళ్లు అస్సలు ఆపిల్ తినకూడదు. దీని వల్ల షుగర్ తొందరగా పెరుగుతుంది. రాత్రి పూట అయితే అసలు ఆపిల్ తినకూడదు. దీని వల్ల గ్యాస్టిక్ సమస్య వస్తుంది. ఉదయాన్నే ఆపిల్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు యాక్టివ్ గా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.