Kidney Stones : మారుతున్న జీవన శైలి వల్ల చాలామంది ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలకి గురవుతున్నారు. వీటి కోసం ఎన్నో రకాల చికిత్సలు కూడా తీసుకుంటున్నారు. అయిన సమస్య తగ్గడం లేదు. నీరు తక్కువగా తాగడం వల్ల చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి. అయితే వీటిని తగ్గించడానికి కొందరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయిన ఫలితం లేదా? అయితే ఈ రెమిడీస్ తో తగ్గించుకోండి. ఇంట్లో ఉండే పదార్థాలతో కిడ్నీలో రాళ్లను తగ్గించుకోవడానికి బెస్ట్ హోమ్ రెమిడీస్ ఇవే. ఒకసారి ప్రయత్నించి చూడండి.
బీన్స్ ఎక్కువగా తినడం
కిడ్నీలో రాళ్లు ఎక్కువగా ఉన్న వాళ్లు బీన్స్ అధికంగా తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే వీటిని కొంత సమయం నానబెట్టి ఉడికించి తినాలి. వీటిని తినడం వల్ల తొందరగా కిడ్నీలోని స్టోన్స్ కరుగుతాయి. కనీసం రోజుకి ఒకసారి అయిన వీటిని తీసుకోవడం మంచిది.
ఆపిల్ సైడర్ వెనిగర్
భోజనం చేయడానికి 30 నిముషాల ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తాగితే అందులోని ఆమ్లం కిడ్నీలోని రాళ్లు కరిగేలా చేస్తుంది. కాబట్టి రోజు దేనిని తీసుకుంటే తొందరగా ఈ సమస్య తగ్గుతుంది.
తులసి ఆకులు
తులసి ఆకులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న తో తొందరగా తొలగిపోతాయి. అయితే కిడ్నీలో రాళ్లు తగ్గాలంటే.. ఒక స్పూన్ తులసి రసంలో తేనే వేసుకుని తాగితే రాళ్లు కరుగుతాయి. అయితే కేవలం పరగడుపున మాత్రమే తాగితే మంచి ఫలితం ఉంటుంది.
మెంతులు
మెంతులు జుట్టు బలంగా ఉండటానికి సాయపడతాయి. అయితే రోజు రాత్రి మెంతులను నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తాగితే.. కిడ్నీలో రాళ్లు తొందరగా తగ్గుతాయి. మెంతులు వల్ల జుట్టు కూడా బలంగా, దృఢంగా తయారవుతుంది.
కొత్తిమీర
కూరల్లో ఎక్కువగా కొత్తిమీర వాడుతుంటారు. అయితే ఈ నీళ్లలో కొత్తిమీర వేసి.. పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత తాగితే కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వేపాకు
చేదు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం తెలిసిన చాలా మంది వేపాకు తినడానికి వెనుకడుగు వేస్తారు. రోజు ఒక రెండు వేపాకు రెబ్బలను నమిలిన లేదా వేపాకు నీరు తాగిన సమస్య తిరుతుంది. కేవలం కిడ్నీ సమస్యలే కాకుండా.. అన్ని అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
ఈ చిట్కాలు పాటిస్తూ.. ఫుడ్ విషయంలో జాగ్రత్త వహించాలి. సరైన ఫుడ్ తీసుకుంటూ బాడీకి సరిపడా నీరు తాగితే కిడ్నీలో స్టోన్స్ కరుగుతాయి. ఈ సమస్య ఉన్నవాళ్లు టమాటో, పాలకూర, క్యాబేజ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిని తింటే కిడ్నీలో రాళ్లు కరగకుండా.. సమస్య ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఈ చిట్కాలు పాటిస్తూ.. ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. అప్పుడే సమస్యను తగ్గించవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.