https://oktelugu.com/

Egg : గుడ్డులోని పచ్చ సోన తినవచ్చా? తింటే ఏమవుతుందో మీకు తెలుసా?

గుడ్డు లోపల పచ్చ సోన తినడానికి ఇష్టపెట్టుకోరు. అయితే గుడ్లులోని పచ్చ సోన తినవచ్చా? తింటే ఏం అవుతుంది? ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు గుడ్డులోని పచ్చసోన తినకూడదో మరి తెలుసుకుందాం.

Written By:
  • Bhaskar
  • , Updated On : September 9, 2024 9:31 am
    Egg

    Egg

    Follow us on

    Egg : ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్ గా ఉండాలని చాలా మంది గుడ్డు తింటుంటారు. గుద్దులోని ప్రోటీన్స్, విటమిన్స్ శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే గుడ్లును ఆరోగ్యానికి మంచిది అని ఎక్కువగా తీసుకోకుండా మితంగా మాత్రమే తీసుకోవాలి. డైట్ ఫాలో అయ్యే వాళ్లు ఎక్కువగా వీటిని ఉడికించి తింటుంటారు. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల బాడీకి వేడి చేస్తుంది. అయితే చాలా మంది ఎగ్ వైట్ తింటారు. కానీ లోపల పచ్చ సోన తినడానికి ఇష్టపెట్టుకోరు. అయితే గుడ్లులోని పచ్చ సోన తినవచ్చా? తింటే ఏం అవుతుంది? ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు గుడ్డులోని పచ్చసోన తినకూడదో మరి తెలుసుకుందాం.

    గుడ్లును రకరకాలుగా వండుతారు. అయితే ఎక్కువ మంది వీటిని ఉడికించి మాత్రమే తింటారు. ఇలా తినేటప్పుడు గుడ్డులోని పచ్చ సోన తినరు. అయితే రోజుకి ఒక గుడ్డు పచ్చ సోనతో తినవచ్చు. కానీ అంత కంటే ఎక్కువగా తినకూడదు. గుడ్డు పచ్చ సోనలో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది. దీనివల్ల బాడీలో ఎక్కువగా కొవ్వు పెరుగుతుంది. దీనివల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణలు చెబుతున్నారు. రోజుకి ఒకటి లేదా రెండు కంటే ఎక్కువగా తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే అధిక రక్తపోటు ఉన్నవాళ్లు గుడ్డులోని పచ్చ సోన తినకపోవడం మంచిది. ఎగ్ వైట్ కూడా మితంగా మాత్రమే తినాలి. ఒక్కరోజు పచ్చ సోన తిన్నా.. రక్త పోటు పెరుగుతుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవాళ్లు గుడ్లులోని పచ్చ సోన జోలికి అసలు వెళ్లవద్దు. గుడ్లు ఎక్కువగా తింటే.. బరువు కూడా పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల బీపీ పెరిగి మధుమేహం కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇన్సులిన్ నిరోధకతను కూడా పెంచుతుంది. కొంతమందికి కడుపులో తిమ్మిరి, వికారం వంటివి కూడా వస్తాయి. అయితే జిమ్ చేసేవాళ్లు వారానికి పది గుడ్లు మాత్రమే తినాలి. అది కూడా కేవలం ఎగ్ వైట్ మాత్రమే తినాలి. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు అసలు గుడ్లు జోలికి వెళ్లకూడదు. ఒకవేళ తింటే కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్టిక్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమస్య ఉన్నవాళ్లు అసలు ఎగ్ జోలికి వెళ్లకూడదు.

    గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే. రోజు ఉడికించిన గుడ్డు తినడం వల్ల ఎముకలు బలంగా తయారు అవుతాయి. అలాగే బాడీ కూడా బలంగా తయారవుతుంది. ఇందులోని విటమిన్లు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా గుడ్లు సాయపడతాయి. అలాగే కళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు రోజుకి ఒకటి లేదా రెండు గుడ్లు తినవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు గుడ్లుకి దూరంగా ఉండటం మంచిది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.