https://oktelugu.com/

Rainy season Food : వర్షాకాలంలో ఈ పోషక పదార్థాలు తీసుకోండి.. అనారోగ్యానికి దూరంగా ఉండండి

మొక్కజొన్న పొత్తుల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఉడికించిన లేదా కాల్చిన పొత్తులను తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బరువును అదుపులో ఉంటుంది. అలాగే ఇందులోని ల్యూటిన్, ఫైటోకెమికల్స్ కంటి చూపును మెరుగుపర్చడంలో బాగా ఉపయోగపడుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2024 5:52 pm
    Follow us on

    Rainy season Food : వాతావరణంలో మార్పులు వల్ల వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తాయి. ఒక్కసారి వర్షం పడితే చాలు.. వెంటనే సీజనల్ వ్యాధులు వచ్చేస్తాయి. దీంతో డెంగీ, మలేరియా వంటివి కూడా వస్తాయి. ఇవి ఒకసారి వస్తే వీటిని తగ్గించడం కూడా చాలా కష్టం. సీజనల్‌గా వచ్చే వ్యాధులు వస్తే బాడీలో రోగనిరోధక శక్తి వెంటనే తగ్గిపోతుంది. కాబట్టి వర్షాకాలంలో పోషకాలు ఉండే కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ వర్షాకాలంలో ఎక్కువగా తినాల్సిన పోషకాలు ఉండే ఆ పదార్థాలేంటో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    అరటి పండ్లు
    ఆరోగ్యానికి అరటి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు, విటమిన్లు వ్యాధినిరోధక శక్తిని తొందరగా పెంచుతాయి. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లకు అరటి పండు బాగా ఉపయోగపడుతుంది. అరటి పండ్లు తీసుకోవడం వల్ల పొట్ట తొందరగా నిండుతుంది. దీంతో ఈ సీజన్‌లో బయట ఫుడ్ తినరు. అప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి రోజులో కనీసం ఒకసారైన అరటిపండును తినడం అలవాటు చేసుకోండి.

    గుడ్లు
    పోషకాలు ఎక్కువగా ఉండే గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు కూడా గుడ్లు తినవచ్చు. ఇందులోని ప్రొటీన్లు బలంగా ఉండేలా చేస్తుంది. అలాగే కండరాలను స్ట్రాంగ్ చేసి, వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో గుడ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే వర్షాకాలంలో ఎక్కువగా దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటంలో గుడ్లు సహాయపడతాయి. రోజూ ఉదయం లేదా సాయంత్రం ఉడికించిన గుడ్లు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

    మొక్కజొన్న
    మొక్కజొన్న పొత్తుల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఉడికించిన లేదా కాల్చిన పొత్తులను తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బరువును అదుపులో ఉంటుంది. అలాగే ఇందులోని ల్యూటిన్, ఫైటోకెమికల్స్ కంటి చూపును మెరుగుపర్చడంలో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తినే డైట్‌లో మొక్కజొన్న ఉండేట్లు చూసుకోవడం ఆరోగ్యానికి మేలు.

    సీజనల్ పండ్లు
    సీజనల్‌గా ఎన్నో రకాల పండ్లు మార్కెట్లో దొరుకుతాయి. బొప్పాయి, దానిమ్మ, జామికాయ వంటివి మార్కెట్లో లభిస్తాయి. వీటిని రోజుకి ఒకసారి అయిన తినడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. తాజా పండ్లు వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు చర్మం కూడా కాంతిమంతంగా ఉంటుంది. వీలైనంత వరకు జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండి తాజా పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.