Dandruff: జుట్టు సమస్యల్లో చుండ్రు సమస్య కూడా ప్రధానమైనదే. చుండ్రు వస్తే చాలా దురద వస్తుంది. చూడటానికి అసలు బాగోదు కదా. ఇది సర్వ సాధారణ సమస్య అయినా సరే ఇర్రిటేషన్ గా అనిపిస్తుంటుంది. ప్రపంచ జనాభాలో సుమారుగా 50% మంది తమ లైఫ్ లో ఏదో ఒక సమయంలో చుండ్రు సమస్యతో బాధ పడతారు అంటున్నారు నిపుణులు. చుండ్రు చిన్నదే. కానీ వెంట్రుకలు బాగా ఊడేలా చేస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించడానికి సహాయపడే ఎన్నో ప్రొడక్ట్స్ మార్కెట్ లో ఉన్నా సరే కొన్ని ఫలితాలను అందించవు. చుండ్రును తట్టుకోలేక ఖరీదైన వస్తువులను వాడినా సరే ఈ సమస్య మాత్రం పోదు.అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే మాత్రం ఖచ్చితంగా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. మరి అదేంటో చూసేయండి.
టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్ లో ఎన్నో ఔషద గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇది చర్మానికి చాలా సహాయం చేస్తుంది. అంతేకాదు ఇది చుండ్రును పోగొట్టడానికి కూడా సహాయపడుతుంది. ఈ ఆయిల్ లో యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి చుండ్రును పోగొడతాయి. టీ ట్రీ ఆయిల్ ఫంగల్ చర్మ సమస్యలను తగ్గిస్తుంది కూడా.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనె జుట్టుకు ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. ఇది జుట్టును బలంగా, పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు చుండ్రును పోగొడుతుంది కూడ. కొబ్బరి నూనె నెత్తికి ఒక మల్టీ టాస్కింగ్ లా సహాయం చేస్తుంది. ఇది నెత్తిని హైడ్రేట్ గా ఉంచి మంటను తగ్గిస్తుంది. ఈ కొబ్బరి నూనె అటోపిక్ చర్మశోథ లక్షణాలను 68% తగ్గించడంలో సహాయం చేస్తుంది అంటున్నారు నిపుణులు. కొబ్బరి నూనెలోని సహజ యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రుకు కారణమయ్యే శిలీంధ్రాలను నివారిస్తాయి. అందుకే తలస్నానం చేయడానికి 2 గంటల ముందు కొబ్బరి నూనెన తలకు పట్టించాలి.
కలబంద: కలబంద చుండ్రును పూర్తిగా పోగొడుతుంది. ఎన్నో చర్మ సమస్యలను నయం చేస్తుంది కూడ. కలబంద జెల్ లో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుకు కారకాలైన శిలీంధ్రాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. అలాగే మంటనుకూడా తగ్గిస్తుంది కలబంద. స్వచ్ఛమైన కలబంద జెల్ ను తలకు పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ఒత్తిడి : ఒత్తిడి వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఎన్నో అనారోగ్య సమస్యల వల్ల బాధ పడాల్సి వస్తుంది. అందుకే ఒత్తిడి లేని జీవితం కోసం శ్రమించాలి. అయితే ఈ ఒత్తిడి వల్ల చుండ్రు సమస్య కూడ వస్తుంది. కానీ ఇది పరోక్షంగా వస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ పెరగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది అనే విషయం తెలిసిందే. చుండ్రుకు కారణమయ్యే ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటాన్ని శరీరానికి కష్టం అవుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్నే మెరుగుపరచడమే కాదు మీ జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.