https://oktelugu.com/

Tea: టీతో ఈ పదార్థాలు తింటే ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

సాధారణంగా అన్ని పదార్థాల్లో ఉప్పు ఉంటుంది. టీతో కలిపి బజ్జీలు, పకోడి వంటివి తింటే అందులోని సోడియం, టీలోని కెఫిన్ కలుస్తుంది. దీంతో రెండు బాడీలో జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో కడుపు ఉబ్బరంగా అనిపించి విరేచనాలు అవుతాయి.

Written By:
  • Dharma
  • , Updated On : September 19, 2024 / 06:00 AM IST

    Tea

    Follow us on

    Tea: మనలో టీ ప్రేమికులు చాలామందే ఉంటారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో టీతాగకుండా అసలు ఉండలేరు. ఉదయం పూట టీ తాగితే దానితో బిస్కెట్లు వంటివి తింటారు. అదే సాయంత్రం అయితే పకోడి, మిక్చర్, బజ్జీ వంటివి తింటుంటారు. టీతో ఏదో ఒకటి లేకపోతే కొందరికి అసలు టీ తాగబుద్ది కాదు. అయితే టీతో ఇలా ఏవైనా స్నాక్స్ అవి ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీతో కలిపి వీటిని తినడం వల్ల అవి మన శరీరంలోకి వెళ్లిన తర్వాత సమస్యలు వస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా టీతో ఇలా ఏదో ఒకటి తింటుంటారు. పెద్దలు కంటే పిల్లలు ఎక్కువగా ఇలా తినడానికి ఇష్టపడతారు. వేడి టీలో బిస్కెట్లు, మిక్చర్ వంటివి వేసుకుని తింటే బాగుంటుదని భావించి తింటారు. తల్లిదండ్రులు కూడా ఏదో ఒకటి తినడం కావాలని ఏం అనకుండా ఇచ్చేస్తారు. ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు. కానీ రోజూ ఇలానే తినడం వల్ల తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రోజూ టీతో ఏ పదార్ధాలు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయో మరి తెలుసుకుందాం.

    విరేచనాలు
    సాధారణంగా అన్ని పదార్థాల్లో ఉప్పు ఉంటుంది. టీతో కలిపి బజ్జీలు, పకోడి వంటివి తింటే అందులోని సోడియం, టీలోని కెఫిన్ కలుస్తుంది. దీంతో రెండు బాడీలో జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో కడుపు ఉబ్బరంగా అనిపించి విరేచనాలు అవుతాయి.

    అజీర్ణం వస్తుంది
    మిక్చర్‌ను కొందరు టీలో కలిపి తాగుతారు. ఇలా మసాలా ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణ క్రియపై ప్రభావం చూపుతుంది. దీంతో కడుపు ఉబ్బరం ఏర్పడి.. అజీర్ణం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టీతో ఎలాంటివి తీసుకోకుండా కేవలం టీ తాగడం ఆరోగ్యానికి మంచిది.

    ఎసిడిటీ పెరగడం
    నూనెతో వేయించిన పదార్థాలు టీతో కలిపి తాగడం వల్ల ఎసిడిటీ ఎక్కువ అవుతుంది. దీంతో గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. కాబట్టి టీతో నూనెతో చేసిన పకోడి, బజ్జీ వంటివి అసలు తినకపోవడం మంచిది.

    జీర్ణ సమస్యలు
    టీతో కలిపి బాగా వేయించిన పదార్థాలు తినకూడదు. ఇలా తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. దీంతో తినే ఫుడ్ సరిగ్గా జీర్ణం కాక మలబద్దకం, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు టీతో ఎలాంటి పదార్థాలు కూడా తీసుకోవద్దు. టీతో ఆయిల్ ఫుడ్స్ తీసుకుని సమస్యలను కొని తెచ్చుకోవద్దు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.