
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. అన్నారు. అయితే అదే సమయంలో కొందరు నిర్లక్ష్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు. కనీసం మాస్క్ కూడా ధరించకుండా బయటికి వెళ్తున్నారు. భౌతిక దూరం గురించి అసలే పట్టంచుకోవడం లేదు. అయితే ఫస్ట్ వేవ్ తగ్గినప్పుడు ఇలాగే చాలా మంది నిర్లక్ష్యం వహించారు. దీంతో కేసులు ఊహించిన స్థాయిలో పెరిగాయి. ఆ తరువాత ఏం జరిగిందే అందరికీ తెలిసిందే. ఇక థర్డ్ వేవ్ ముప్పు తప్పదని కొందరు వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే దానికి సంకేతాలు కూడా వస్తున్నాయని తెలుపుతున్నారు.
ప్రస్తుతం దేశంలో రోజూవారి కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 40 వేలకు దిగువగా కేసులు నమోదయ్యాయి. అయితే మహారాష్ట్రలో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. జూలె నెల తొలి 11 రోజుల్లో మహారాష్ట్రలో 88,130 కేసులు నమోదయ్యాయి. కోల్హాపూర్ జిల్లాలో రోజుకు 300లకుపైగానే కేసులు నమోదవుతున్నాయి. ముంబైలో మాత్రం రోజువారి కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఆ తరువాత కేరళలోనూ 50 వేలకు పైగానే కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలో మూడో లాక్డౌన్ ను కూడా ప్రకటించేశారు.
ఫస్ట్ వేవ్ ముగిసిన తరువాత మహారాష్ట్రలోనే కేసులు పెరగడం ప్రారంభమయ్యాయి. అప్పుడు కూడా కేరళలోనూ పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ రేటు ఎక్కువగా నమోద కావడంతో మూడోవేవ్ కు ఇదే సంకేతమని అంటున్నారు. ఇప్పటికే డెల్టా వైరస్ తో కొందరు బాధపడుతున్నారని కొందరు వైద్యలు చెబుతున్నా.. దీంతో ప్రమాదమేమి లేదని మరికొందరు వాదిస్తున్నారు.
ఈ తరుణంలో గత రెండు వేవ్ ల నుంచి పాఠం నేర్చుకొని ప్రభుత్వాలు అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే ప్రజల్లో మాత్రం అవగాహన కల్పించలేపోతున్నారు. దీంతో భౌతిక దూరం మరిచి రోడ్లపై గుంపులుగా కనిపిస్తున్నారు. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే మరోసారి ముప్పు తప్పదని హెచ్చిరిస్తోంది.