Fennel Seeds: సోంపు గింజల వాటర్ తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సోంపు గింజల్లో కార్మినేటివ్ లక్షణాలు ఉంటాయి. జీర్ణశయాంతర పేగుల్లో కండరాలను కదిలించడంలో గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించడంలో ఎంతో తోడ్పుడుతాయి సోంపు గింజలు.

Written By: Swathi, Updated On : March 21, 2024 6:42 pm

Fennel Seeds

Follow us on

Fennel Seeds: సోంపు గింజలు తినడం చాలా మందికి ఇష్టం. ప్రతి రోజు సోంపు గింజలు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చట. కొందరు సోంపు గింజల వాటర్ ను కూడా తాగుతారు. మరి ఈ సోంపు గింజల వాటర్ వల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా లేదా? అనే వివరాలు ఇప్పుడు మీకోసం..

1..గ్యాస్, ఉబ్బరం.. సోంపు గింజల్లో కార్మినేటివ్ లక్షణాలు ఉంటాయి. జీర్ణశయాంతర పేగుల్లో కండరాలను కదిలించడంలో గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించడంలో ఎంతో తోడ్పుడుతాయి సోంపు గింజలు.

2.. జీర్ణ చికిత్స.. అనెథోల్ అనే నూనెలను కలిగి ఉంటాయి సోంపు గింజలు. ఇవి జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రేరేపించడమే కాదు జీర్ణక్రియలో కూడా సాయపడుతాయి. ఉబ్బరం తగ్గడం మాత్రమే కాకుండా.. ప్రేగు కదలికలకు కూడా సాయ పడుతాయి సోంపు వాటర్. దీని వల్ల మలబద్ధకం సమస్యల తొలిగిపోతుంది.

3..బరువు తగ్గడం..సోంపు గింజట నీరును తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. జీవక్రియను పెంచి బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. మూత్రవిసర్జన కూడా సాపీగా సాగుతుంది. కడుపు ఉబ్బరాన్ని పోగొడుతాయి సోంపు వాటర్.

4..రోగ నిరోధక శక్తి.. విటమిన్ సి, ఐరన్ వంటివి ఇందులో ఉండే విటమన్, ఖనిజాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడుతాయి. ఈ సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ లు, అనారోగ్యాల నుంచి రక్షణ అందుతుంది.

5.. కంటి ఆరోగ్యం.. సోంపు గింజల్లో విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తోంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మచ్చలు తగ్గుతాయి. కంటి సమస్యలు కూడా తొలిగిపోతాయి.

సోంపు గింజల నీటిని తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా..ఇంకెందుకు ఆలస్యం మీ డైట్ నిపుణులను సలహా తీసుకొని మీరు కూడా తాగేసేయండి. ప్రతి ఒక్క ఫుడ్ అందరి శరీరాలకు నప్పవు. కాబట్టి ఎలాంటి కొత్త పదార్థాలను తీసుకోవాలి అనుకున్న ఒకసారి మీ వైద్యులను సంప్రదించడం ఉత్తమం అని తెలుసుకోండి.