Ram Charan: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. అందులో భాగంగానే మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లో తన సత్తా చాటితే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఆగస్ట్ 15 వ తేదీన మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తో సూపర్ హిట్ కొట్టడానికి రెఢీ అవుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు బావ బామ్మర్దులు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక చిన్నప్పటి నుంచి వీళ్ళు కలిసి పెరిగారు. అయితే అల్లు అర్జున్ లో ఒక విషయాన్ని చూస్తే మాత్రం రామ్ చరణ్ కి ఈర్ష్య కలుగుతుందట.
అది ఏంటి అంటే ఎవరైనా సరే ఆయన మొహం ముందు ఆయన్ని విమర్శించిన కూడా దాన్ని వేట్ గా తీసుకోకుండా లైట్ తీసుకొని తన పనిలో తాను నిమగ్నం అయిపోతాడట. అలా ఉండడం చాలా కష్టం ఎవరైనా ఏదైనా అంటే ప్రతి ఒక్కరు చాలా బాధపడతారు. దానివల్ల మనకు వచ్చేది ఏమీ ఉండదు. ఇంకా మనమే మానసికంగా గాని, ఫిజికల్ గా కానీ చాలా స్ట్రెస్ కి ఫీల్ అవ్వడం తప్ప, దాంట్లో మనకు వచ్చేది ఏమీ ఉండదు.
కానీ మనల్ని అనేవాళ్లు కూడా ఏదో ఒక రకంగా మనల్ని దెబ్బకొట్టాలనే ఉద్దేశ్యం తోనే అలా అంటారు. అలాంటప్పుడు మనం ఇబ్బంది పడి వాళ్లకి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాం. కానీ బన్నీ మాత్రం అలా చేయడు. వాళ్ళు ఎంత విమర్శించిన పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ఈ విషయాన్ని చూసినప్పుడు నాకు కొంచెం ఈర్ష్య కలుగుతుంది. నేను కూడా అలా ఉంటే అయిపోవు అని అనుకుంటూ ఉంటానని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…