Director Krish: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ సపరేట్ స్టైల్ ను ఏర్పాటు చేసుకొని అదే స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లందరికీ ఒక్కొక్క స్టైల్ అనేది ఉంది. ముఖ్యంగా క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్ మాత్రం తను నమ్మిన ఒక డిఫరెంట్ వే లోనే సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు.
ముఖ్యంగా ఒక సామాన్య మానవుడు ఎలాంటి బాధలను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి సొసైటీలో పేద వాళ్ల పరిస్థితి ఏంటి ఇలాంటి కొన్ని కథాంశాలను తీసుకొని ఆయన కళ్ళకు కట్టినట్టుగా సినిమాను తీసి ప్రేక్షకుడి ని మెప్పించడంలో ఎక్స్ పర్ట్ అనే చెప్పాలి. అయితే ఇలాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వడానికి ముందు రామ్ గోపాల్ వర్మ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయడానికి వెళ్ళాడట.
దాంతో వర్మ అతన్ని చూసి ఇంటర్వ్యూ చేశాడు. ఇక వర్మ అడిగిన అన్ని క్వశ్చన్స్ కి టకటక సమాధానం చెప్పిన క్రిష్ తో నీకు సినిమా మీద ఇంత నాలెడ్జ్ ఉంది కదా మళ్ళీ నా దగ్గర ఎందుకు వర్క్ చేయాలి అనుకుంటున్నావ్ అని వర్మ అడిగాడట. దానికి క్రిష్ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలని చేద్దాం అనుకుంటున్న అని చెప్పాడట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటూ ఏమీ ఉండదు నా దగ్గర వర్క్ చేసిన కూడా నీకు తెలిసిన పనినే నువ్వు మళ్ళీ చేయాల్సి ఉంటుంది.
కాబట్టి నువ్వు అర్జెంటుగా లేట్ చేయకుండా డైరెక్టర్ గా ఒక సినిమా స్టార్ట్ చెయ్ నీకున్న నాలెడ్జ్ కి మంచి సక్సెస్ ని కొడతావని చెప్పాడట…దాంతో కొద్ది రోజుల పాటు వర్మ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఎట్టకేలకు శర్వానంద్ తో ‘గమ్యం ‘ సినిమాని స్టార్ట్ చేసి ఆ సినిమాతో ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.
ఇక మొత్తానికైతే ఆయన ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడనే చెప్పాలి. ఇక ఆయన పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు ఇది ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ లేదు. దాంతో ఆయన ఇప్పుడు మరో సబ్జెక్ట్ ను డీల్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది…