ఫిట్ గా ఉన్నా గుండెపోటు వచ్చే ఛాన్స్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా, ఫిట్ గా ఉండటం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతూ ఉంటారు. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వయస్సు పెరిగే కొద్దీ గుండెపోటు ముప్పు కూడా పెరుగుతుందని తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. Also Read: పరగడుపున వెల్లుల్లి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..? శాస్త్రవేత్తలు 45 సంవత్సరాల […]

Written By: Navya, Updated On : January 16, 2021 10:52 am
Follow us on

శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా, ఫిట్ గా ఉండటం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతూ ఉంటారు. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వయస్సు పెరిగే కొద్దీ గుండెపోటు ముప్పు కూడా పెరుగుతుందని తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Also Read: పరగడుపున వెల్లుల్లి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

శాస్త్రవేత్తలు 45 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లలో గుండెజబ్బుల ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు. శరీరం ఫిట్ గా ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కొందరిలో గుండెజబ్బులు వంశపారంపర్యంగా వస్తాయని అయితే హై బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధ పడేవాళ్లు కచ్చితంగా తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read: చలికాలంలో ఉసిరి తీసుకుంటే కలిగే లాభాలు తెలుసా..?

వంశపారంపర్యంగా గుండెజబ్బుల సమస్యతో బాధ పడే వాళ్లు సైతం గుండెనొప్పి లక్షణాలు లేకపోయినా గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ కణాలను తగ్గించుకోవడం ద్వారా గుండెజబ్బులకు చెక్ పెట్టవచ్చు. 40 సంవత్సరాల పై బడిన వాళ్లు ఒక్కసారైనా గుండె సంబంధిత పరీక్షలను చేయించుకోవాలి. 40 ఏళ్లు పైబడిన వారు పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం కూడా ముఖ్యమే.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యల ఉన్నాయో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఒత్తిడి, జన్యుపరమైన మార్పులు కూడా కొన్ని సందర్భాల్లో గుండెజబ్బులకు కారణమవుతాయి. ఫిట్ గా ఉన్నంత మాత్రాన గుండెజబ్బులు రావని అనుకోవడానికి లేదని వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.