ముద్రగడతో సోము వీర్రాజు.. ఏపీని షేక్ చేసే కలయిక.. ఏం జరుగనుంది?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అధికారం కొన్ని అగ్ర కులాల చేతుల్లోనే ఇంతకాలం మగ్గింది. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలుగా విడిపోయినా అదే అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతోంది. తెలంగాణలో వెలమ దొరలు.. ఏపీలో కమ్మలు, రెడ్లు అధికారంలోకి వచ్చారు. అయితే అణగారిన బీసీలకు రాజ్యాధికారం కల్లేనా? అన్న ఆందోళన ఆ వర్గాల్లో ఉంది. ఏపీలో ప్రబలంగా.. భారీ ఓటు బ్యాంకుగా ఉన్న కాపులు రాజ్యాధికారం దిశగా సాగలేకపోతున్నారు. Also Read: కేసీఆర్ కు ఇది అవమానమే మరీ..! నాడు […]

Written By: NARESH, Updated On : January 16, 2021 11:10 am
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అధికారం కొన్ని అగ్ర కులాల చేతుల్లోనే ఇంతకాలం మగ్గింది. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలుగా విడిపోయినా అదే అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతోంది. తెలంగాణలో వెలమ దొరలు.. ఏపీలో కమ్మలు, రెడ్లు అధికారంలోకి వచ్చారు. అయితే అణగారిన బీసీలకు రాజ్యాధికారం కల్లేనా? అన్న ఆందోళన ఆ వర్గాల్లో ఉంది. ఏపీలో ప్రబలంగా.. భారీ ఓటు బ్యాంకుగా ఉన్న కాపులు రాజ్యాధికారం దిశగా సాగలేకపోతున్నారు.

Also Read: కేసీఆర్ కు ఇది అవమానమే మరీ..!

నాడు చిరంజీవి ప్రజారాజ్యంతో ముందుకొచ్చినా రెడ్లు, కమ్మల కుట్రలు, కుతంత్రాలకు ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి రాజకీయ సన్యాసం చేశారు. ఇప్పుడు కాపుల తరుఫున పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ముందచుకొని ఆ పార్టీని నిలదొక్కుకోకుండా చేశారు.

అందుకే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ అటు తెలంగాణలో బీసీ అయిన బండి సంజయ్ కు పట్టం కట్టింది. ఇటు ఆంధ్రాలోనే కాపు నేత సొము వీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. ఇప్పుడు ఆయన కాపుల ఏకీకరణ కోసం కృషి చేస్తున్నారు. సోము వీర్రాజు ఏపీ అధ్యక్షుడిగా గద్దెనెక్కగానే మొదట చేసిన పని కాపు సామాజికవర్గానికే చెందిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను కలిసి వారి మద్దతు మూడగట్టారు. జనసేనతో పొత్తుకు మార్గం చూపారు. ఇప్పుడు ఏపీలో బీజేపీ-జనసేన కలిసి ముందుకెళుతున్నాయి.

ఈ క్రమంలోనే మరో కొత్త ఎత్తును బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వేశారు. ఈరోజు ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. కాపులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి రాష్ట్రంలో వచ్చేసారి అధికారం సాధించేదిశగా కేంద్రంలోని బీజేపీ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది.  సోమువీర్రాజు ఈరోజు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో భేటి కానుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.  ముద్రగడ పద్మనాభంతో కిర్లంపూడిలోనీ వారి స్వగృహంలో ఈ ఉదయం 09.00 గంటలకు మర్యాద పూర్వకంగా భేటీ కానున్నట్లు సోము వీర్రాజు ప్రకటించారు. అయితే ఇది మర్యాద పూర్వక భేటి కాదని.. ఏపీలో కాపులందరినీ ఏకీకరణ చేసే గొప్ప ముందడుగు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాపులకు రిజర్వేషన్లపై సీఎంగా జగన్ గద్దెనెక్కగానే ఒక బహిరంగ లేఖ రాశారు ముద్రగడ.. కాపుల రిజర్వేషన్లపై ప్రధాని మోడీతో చర్చించాలని జగన్ ను కోరారు.అయితే టీడీపీతో ఫైట్ చేసినట్టు ఆయన జగన్ తో ఫైట్ చేయడం లేదని కొందరు టీడీపీలో ఉన్న  కాపు నేతలే అప్పట్లో ఆరోపించారు. కాపుల్లోనే అనైక్యత సృష్టిస్తూ ఉద్యమాన్ని నీరుగారుస్తున్న వైనంపై ముద్రగడ మనస్థాపం చెందారు.   కాపు ఉద్యమం నుంచి తప్పుకోబోతున్నానని ప్రకటించి సంచలనం సృష్టించారు.

Also Read: దేశ ప్రజలందరూ ఊపిరిపీల్చుకోండి..!

ముద్రగడ ఆ లేఖలో కాపుల్లోని నేతలే తనను టార్గెట్ చేయడంపై మనస్థాపం చెందారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తనపై కొందరు పెద్దలు దుష్ర్పచారం చేయిస్తున్నారని.. తనను కాపు ద్రోహిగా గజ దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై మీడియా, సోషల్ మీడియాలో ఎందుకు మానసికదాడులు చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. ఉద్యమం చేసిన కాలంలో ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయానని.. ఏనాడు చింతించలేదని.. కాపు ద్రోహిగా చిత్రీకరించడం కలిచివేసిందన్నారు. కాపు రిజర్వేషన్లు సాధించడమే తన అంతిమ ఆశయమని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.ముద్రగడ లేఖ ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

కాపు ఉద్యమం నుంచి తప్పుకొని కాపుల పోరాట పంథాను పక్కనపెట్టి ముద్రగడను ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు, అదే సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజు డిసైడ్ అయినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కాపులను ఏకతాటిపైకి తెచ్చి రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను కలిసిన సోము వీర్రాజు ఇప్పుడు ముద్రగడనుకూడా కలిసి ఏకం చేస్తే ఖచ్చితంగా ఏపీలో బీజేపీకి ప్లస్ అవ్వడంతోపాటు కాపులు రాజకీయంగా ఎదిగే అవకాశం స్పష్టంగా ఉంటుంది.

ముద్రగడ పద్మనాభం కాపుల ఉద్యమంలో ఉంటే ఎప్పటికీ తమకు క్రెడిట్.. ఆధిపత్యం రాదనే కుట్రతోనే వైసీపీ, టీడీపీలు ఎప్పటి నుంచో ఆయనను టార్గెట్ చేసి.. వారి అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ముద్రగడపై తీవ్ర దుష్ప్రచారం చేశారనే టాక్ ఉంది. ఇవన్ని ఆయనను కాపు ఉద్యమం నుంచి వైదొలిగేలా చేస్తున్నాయి. అదే ప్రత్యర్థి టీడీపీ, వైసీపీలకు కావాల్సింది. కాపులకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చి వారిని ఊకోబెడితే రాజ్యాధికం రెడ్లు, కమ్మల చేతుల్లోనే శాశ్వతంగా ఉంటుంది. అయితే బీజేపీ మాత్రం ఏపీలో బలమైన శక్తిగా ఉన్న బలహీనవర్గాలైన కాపులకు పెద్దపీట వేయడం.. సోము వీర్రాజు అధ్యక్షుడయ్యాక పరిస్థితి మారింది.  ఇప్పుడు ముద్రగడతో సోము వీర్రాజు భేటి కనుక సక్సెస్ అయితే ఏపీ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు వస్తుందన్న ధీమా ఆయా వర్గాల్లో ఉంది.

-నరేశ్

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్