https://oktelugu.com/

యూజర్లకు శుభవార్త.. ప్రైవసీ పాలసీపై వెనక్కు తగ్గిన వాట్సాప్..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త ప్రైవసీ పాలసీ విషయంలో వెనక్కు తగ్గింది. కొత్త ప్రైవసీ పాలసీ నిర్ణయం వల్ల వాట్సాప్ యూజర్లు టెలీగ్రాం, సిగ్నల్ యాప్స్ వైపు ఆకర్షితులు అవుతున్న నేపథ్యంలో వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ యూజర్లు వచ్చే నెల 8వ తేదీలోపు ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోతే వాట్సాప్ డీయాక్టివేట్ అవుతుందని గతంలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. Also Read: సిగ్నల్ యాప్ కు మారుతున్నారా.. […]

Written By: , Updated On : January 16, 2021 / 10:26 AM IST
Follow us on

WhatsApp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త ప్రైవసీ పాలసీ విషయంలో వెనక్కు తగ్గింది. కొత్త ప్రైవసీ పాలసీ నిర్ణయం వల్ల వాట్సాప్ యూజర్లు టెలీగ్రాం, సిగ్నల్ యాప్స్ వైపు ఆకర్షితులు అవుతున్న నేపథ్యంలో వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ యూజర్లు వచ్చే నెల 8వ తేదీలోపు ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోతే వాట్సాప్ డీయాక్టివేట్ అవుతుందని గతంలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Also Read: సిగ్నల్ యాప్ కు మారుతున్నారా.. వాట్సాప్ గ్రూపులను ఎలా మార్చుకోవాలంటే..?

అయితే తాజాగా వాట్సాప్ మే నెల 15వ తేదీ నుంచి కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలను అమలులోకి తీసుకొస్తామని పేర్కొంది. ప్రపంచ దేశాల్లో ఎక్కువ సంఖ్యలో యూజర్లు వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ వాట్సాప్ యాప్ యూజర్లకు మరింత చేరువవుతోంది. అయితే కొత్త ప్రైవసీ పాలసీ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు రావడంతో వాట్సాప్ యూజర్లు ఇతర యాప్ ల వైపు ఆకర్షితులు అవుతున్నారు.

Also Read: వాహనదారులకు శుభవార్త.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అక్కర్లేని స్కూటర్..!

అయితే వాట్సాప్ మాత్రం తమ యాప్ గురించి అసత్య ప్రచారం జరుగుతోందని వెల్లడించింది. కొత్త ప్రైవసీ పాలసీపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాట్సాప్ గడువు తేదీని మారుస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొత్త అప్ డేట్ గురించి వాట్సాప్ ప్రతినిధులు మాట్లాడుతూ చాలామందిలో ఈ అప్ డేట్ కు సంబంధించి గందరగోళం నెలకొందని చెప్పారు. మే 15 నుంచి వాట్సాప్ లో కొత్త బిజినెస్ ఆప్షన్లు రానున్నాయని వెల్లడించారు.

మరిన్ని వార్తలు కోసం: వైరల్

యూజర్ల నిర్ణయం ప్రకారమే పాలసీని సెట్ చేస్తామని వాట్సాప్ తెలిపింది. ఈ కొత్త అప్ డేట్ వల్ల ఫేస్ బుక్ తో డేటా షేర్ చేసుకునే సామర్థ్యం పెరగడం లేదని వాట్సాప్ పేర్కొంది. ఫేస్ బుక్ నుంచి వాట్సాప్ సెక్యూర్ హోస్టింగ్ సర్వీసెస్ ఆప్షన్ ను మాత్రమే ఎంచుకుందని కాల్స్, వాట్సాప్ చాట్ ను ట్రాక్ చేయడం ఫేస్ బుక్ కు కూడా సాధ్యపడదని వాట్సాప్ చెబుతుండటం గమనార్హం.