ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా విజృంభణ తగ్గక ముందే కొత్తరకం కరోనా స్ట్రెయిన్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. యూకేలో కనిపించిన స్ట్రెయిన్ గురించి తెలిసి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే తాజాగా ఇండియాలోనే కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్ కనిపించడం గమనార్హం. మన దేశంలోనే ప్రమాదరకరమైన మ్యుటేషన్ కనిపించడం శాస్త్రవేత్తలు, వైద్యులను సైతం టెన్షన్ పెడుతోంది.
Also Read: స్మోకింగ్ చేసేవాళ్లకు అలర్ట్.. కరోనా ప్రభావం ఎక్కువంటున్న శాస్త్రవేత్తలు..!
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ కు చెందిన ముగ్గురు కరోనా రోగుల్లో శాస్త్రవేత్తలు కొత్తరకం కరోనా మ్యుటేషన్ ను కనిపెట్టారు. నిఖిల్ పట్కార్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ విషయాలను వెల్లడించారు. 700 శాంపిల్స్ కు జెనెటిక్ సీక్వెన్సింగ్ చేస్తున్న సమయంలో శాస్త్రవేత్తలు మ్యుటేషన్ ను గుర్తించారు. కొత్తరకం మ్యుటేషన్లను యాంటీబాడీలు ఉన్నా గుర్తించలేకపోవడం వల్ల కొత్తరకం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: కరోనా వ్యాక్సిన్ ఇమ్యూనిటీ పవర్ ఎంతకాలం ఉంటుందంటే..?
భారతదేశంలో కనిపించిన వేరియంట్ ఇతర దేశాల్లో కనిపించిన కరోనా వేరియంట్లతో పోల్చి చూస్తే మరింత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టాటా మొమోరియల్ సెంటర్ కరోనా రోగుల యొక్క జెనెటిక్ సీక్వెన్సింగ్ చేస్తుండగా ఈ విషయం వెల్లడైంది. కొత్తరకం కరోనా కనిపించిన ముగ్గురిలో ఇద్దరు ఇంట్లో కూర్చుని చికిత్స తీసుకుంటూ ఉండగా ఒకరు మాత్రం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
దేశంలో ప్రజలను కొత్త ఏడాదిలో కూడా కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కొత్త వేరియంట్ లకు పని చేస్తుందా…? లేదా..? అనే విషయం తెలియాల్సి ఉంది.