https://oktelugu.com/

స్మోకింగ్ చేసేవాళ్లకు అలర్ట్.. కరోనా ప్రభావం ఎక్కువంటున్న శాస్త్రవేత్తలు..!

మగవాళ్లలో కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. స్మోకింగ్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా చాలామంది వివిధ కారణాల వల్ల స్మోకింగ్ ను అలవాటుగా మార్చుకుంటారు. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో స్మోకింగ్ అలవాటుకు దూరమైతే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కరోనా వైరస్ ప్రభావం పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. Also Read: ప్రజలకు షాక్.. భారత్ లో డేంజ‌రస్‌ క‌రోనా మ్యుటేష‌న్‌..! అదేపనిగా స్మోకింగ్ చేసేవారిలో సాధారణ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 10, 2021 / 08:22 PM IST
    Follow us on


    మగవాళ్లలో కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. స్మోకింగ్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా చాలామంది వివిధ కారణాల వల్ల స్మోకింగ్ ను అలవాటుగా మార్చుకుంటారు. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో స్మోకింగ్ అలవాటుకు దూరమైతే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కరోనా వైరస్ ప్రభావం పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

    Also Read: ప్రజలకు షాక్.. భారత్ లో డేంజ‌రస్‌ క‌రోనా మ్యుటేష‌న్‌..!

    అదేపనిగా స్మోకింగ్ చేసేవారిలో సాధారణ వ్యక్తులలో కనిపించే కరోనా లక్షణాలతో పోలిస్తే ఎక్కువగా కరోనా లక్షణాలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కింగ్స్ కాలేజ్ లండన్ చేసిన అధ్యయనం ద్వారా పొగ తాగే అలవాటుకు కరోనాకు సంబంధం ఉందని వెల్లడైంది. కరోనా సింప్టోమ్ స్టడీ యాప్ ద్వారా శాస్త్రవేత్తలు డేటాను విశ్లేషించారు. ప్రాథమిక అధ్యయనాలు సైతం కరోనా గురించి ఇదే విషయాన్ని వెల్లడించాయి.

    Also Read: కరోనా వ్యాక్సిన్ ఇమ్యూనిటీ పవర్ ఎంతకాలం ఉంటుందంటే..?

    2,401,982 మందిపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. రుచి, వాసన కోల్పోవడం, కండరాల నొప్పులు, డయేరియా లాంటి లక్షణాలు స్మోకింగ్ చేసేవాళ్లలో ఎక్కువగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకునే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యాక్సిన్ తీసుకుంటే మాత్రమే వైరస్ ను కట్టడి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    మరోవైపు కరోనా వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ ఈ నెల 16 నుంచి పంపిణీ కానుండగా ప్రాధాన్యత ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరగనుంది. సిగరెట్ స్మోకింగ్ వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.