కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలోని ప్రజలకు గతంతో పోలిస్తే ఆదాయం భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ఆదాయం తగ్గడం వల్ల ప్రజలు అత్యవసరాలకు మాత్రమే డబ్బును ఖర్చు చేస్తూ వీలైనంత వరకు పొదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గతంతో పోలిస్తే అనవసర వస్తువులకు ప్రజలు ప్రాధాన్యతనివ్వడం తగ్గించేశారు. అయితే అన్ని ఖర్చులు తగ్గినా రోజురోజుకు నిత్యావసర వస్తువులు మాత్రం పెరుగుతున్నాయి.
Also Read: మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిందా.. డబ్బులు తీసుకోవడం ఎలా అంటే..?
అయితే నిత్యావసర వస్తువుల ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. టూత్ పేస్ట్, సోప్స్, ఆయిల్స్, బిస్కెట్స్, ఇతర నిత్యావసర ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. సఫోలా ఆయిల్స్, పారాచ్యూట్ లాంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తులలో కొన్ని ఉత్పత్తుల ధరలు పెంచగా మరికొన్ని కంపెనీలు కూడా ధరలు పెంచే పనిలో ఉన్నాయని తెలుస్తోంది.
Also Read: కారు కొనాలనుకునే వాళ్లకు శుభవార్త.. రూ.80 వేల డిస్కౌంట్..?
ధరలు పెంచకపోతే తమ సంస్థల లాభాలు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ కంపెనీలు భావిస్తున్నాయి. ఒక విధంగా వంటనూనెల ధరలు పెరగడం వల్ల కూడా కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను భారీగా పెంచుతున్నట్టు తెలుస్తోంది. మార్కెట్ లో పోటీని బట్టి ధరల పెంపు విషయంలో పార్లే, డాబర్ లాంటి ప్రముఖ కంపెనీలు ముందడుగులు వేయనున్నాయి.
మరిన్ని వార్తల కోసం: వ్యాపారము
మార్కెట్ లో ఉన్న పోటీని బట్టి ధరల పెంపు ఉండే అవకాశం ఉంది. ధరలు పెంచకపోతే మార్జిన్లపై తీవ్రంగా ప్రభావం పడుతుందని కంపెనీల ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. పతంజలి ధరల పెంపుపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా భవిష్యత్తులో తీసుకోనుందని తెలుస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది.