https://oktelugu.com/

Bladder Infections : మూత్రాశయ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో వాటిని దూరం చేయొచ్చు

తద్వారా ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు కళ్లెం వేస్తాయి దనియాలు..మరీ ముఖ్యంగా మూత్రాశయం లేదా మూత్రనాళంలో బ్యాక్టీరియా వల్ల కలిగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు త్వరగా చెక్ పడుతుంది అంటున్నారు నిపుణులు.

Written By:
  • NARESH
  • , Updated On : August 17, 2024 / 10:05 PM IST

    Bladder Infections

    Follow us on

    Bladder Infections : కొన్ని ఆరోగ్య సమస్యలు పురుషుల్లో, మహిళల్లో కామన్ గా ఉంటాయి. కానీ కొన్ని సమస్యలు మాత్రం కేవలం మహిళల్లో ఉంటే మరికొన్ని సమస్యలు మాత్రం కేవలం పురుషుల్లోనే కనిపిస్తాయి. అందుకే కొన్ని సమస్యల గురించి వ్యాధుల గురించి అవగాహన ఉండటం వల్ల వాటి నుంచి త్వరగా బయటపడవచ్చు. లేదంటే త్వరగా కోలుకోవచ్చు. ఇదిలా ఉంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎవరిలో ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది. దీన్ని చెక్ పెట్టడానికి ఉన్న టిప్స్ ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య వల్ల మహిళలు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక ఈ సమస్య మగవారిలో కూడా ఉంటుంది అంటున్నారు నిపుణులు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ప్రధానంగా యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు మంట రావడం, తరచుగా యూరిన్ వెళ్లాలి అనిపించడం, యూరిన్ అర్జెంటుగా రావడం వంటి సమస్యలు వస్తాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఏయే సలహాలు పాటించాలి అని తెలుసుకుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. మరి దీనికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో వైద్యులు ఏమంటున్నారో కూడా తెలుసుకుంటే మీకు సింపుల్ కదా. అయితే అది కూడా తెలుసుకోండి.

    పానీయాలు: రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగుతుండాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల బ్లాడర్ లో బ్యాక్టీరియా ఉంటే యూరిన్ ద్వారా బయటకు వెళ్తుంది.
    క్రాన్ బెర్రీ జ్యూస్: క్రాన్ బెర్రీ జ్యూస్ బ్లాడర్ లో ఉన్న బాక్టీరియాను, బ్యాక్టీరియా పెరుగుదలను కూడా నశించేలా చేస్తుంది. సో మీకు ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
    విటమిన్-C ఆహారం: విటమిన్ C యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తీవ్రతను తగ్గించడంలో చాలా తోడ్పడుతుంది అంటున్నారు నిపుణులు.
    పెరుగు తినడం: పెరుగులో ప్రోబైయాటిక్స్ లు పుష్కలంగా ఉంటాయి. పెరుగు తినడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది కాబట్టి మీ డైట్ లో ఈ పెరుగును చేర్చుకోవడం ముఖ్యం.
    దాల్చిన చెక్క: వంటల్లో చాలా మంది ఉపయోగించే పదార్థం దాల్చిన చెక్క.ఇందులోని గుణాలు బాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రికవరీ కూడా చాలా వేగంగా జరుగుతుంది.
    వైద్య సలహా: ఈ చిట్కాలతో పాటు, డాక్టర్ సూచించిన యాంటీబయోటిక్స్ ను వాడటం వల్ల కూడా మీ సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. వైద్యుని సలహాతో పాటు ఈ చిట్కాలను పాటిస్తే, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది.

    దనియాలతో సింపుల్ గా చెక్: ధనియాల్లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌ల వంటి హానికరమైన సూక్ష్మజీవులను చంపేస్తాయి. అంతేకాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. తద్వారా ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు కళ్లెం వేస్తాయి దనియాలు..మరీ ముఖ్యంగా మూత్రాశయం లేదా మూత్రనాళంలో బ్యాక్టీరియా వల్ల కలిగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు త్వరగా చెక్ పడుతుంది అంటున్నారు నిపుణులు.