Rajamouli: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఎలాంటి సినిమాలు చేసిన కూడా వాళ్లకున్న క్రేజ్ తగ్గదు. తద్వారా వాళ్ళ నుంచి వరుస సినిమాలు వచ్చి ప్రేక్షకులను మెప్పించే ఆస్కారమైతే ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ను దక్కించుకున్న దర్శకుడు రాజమౌళి…ఆయన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలే కావడం విశేషం…ఇక ప్రస్తుతం తెలుగులో కమర్షియల్ మూవీస్ తో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఎక్కువ ఆదరణను సంపాదించుకుంటున్నాయి. ఇక వాటితో పాటుగా హార్రర్ సినిమాలను కూడా చేస్తే బాగుంటుందని కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. నిజానికి హార్రర్ సినిమాలు తెలుగులో చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. హాలీవుడ్ ఇండస్ట్రీ లో హార్రర్ జానర్ కి చాలా ప్రత్యేకమైన స్థానమైతే ఉంది. వాళ్లందరూ హార్రర్ సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటారు. మన వాళ్లు సైతం ఇక్కడ హార్రర్ సినిమాలు పెద్దగా రాకపోవడంతో హాలీవుడ్ సినిమాలనే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొంతమందికి హార్రర్ సినిమాలంటే ఇష్టం…రాజమౌళి లాంటి డైరెక్టర్ ఒకసారి హర్రర్ సినిమాని చేస్తే చాలామంది దర్శకులు ఆ జానర్ లో సినిమాలు చేయడానికి ఇష్టపడతారు.
అలాగే ఆ జానర్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ అవుతుందని పలువురు సినిమా మేధావులతో పాటు ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తుండటం విశేషం… ఇక ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను హైలీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా తెరమీద ఆవిష్కరించబోతున్నాడనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెబుతున్నాడు.
ఇక ఈ క్రమంలోనే రాజమౌళి ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. ఈ సినిమాతో 3000 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొడతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటి వరకు 4 షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసిన రాజమౌళి ప్రస్తుతం 5 వ షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి 2027 వ సంవత్సరం ఏప్రిల్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో రాజమౌళి ఉన్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే సినిమాని ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…