Homeబిజినెస్best mpv cars india : 7 సీటర్ కారు కొనాలని అనుకునే వారికి గుడ్...

best mpv cars india : 7 సీటర్ కారు కొనాలని అనుకునే వారికి గుడ్ న్యూస్..

best mpv cars india : ఉమ్మడి కుటుంబం ఉన్నవారు అంతా కలిసి విహారయాత్రలకు వెళ్లాలని అనుకుంటుంటారు. ఇలాంటివారు సొంతంగా కారు ఉంటే మరింత సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో కారు కొనాలని అనుకున్నప్పుడు MPV సెగ్మెంట్ గురించి ఆలోచిస్తారు. ఇలాంటి వేరియంట్ ఉన్న కార్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన కొన్ని ముఖ్యమైన కార్లు మాత్రం ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. అయితే లేటెస్ట్ గా ఫిబ్రవరి 17న మూడు కంపెనీలు 7 సీటర్ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ఈ కార్లు కార్యాలయ అవసరాలతో పాటు ఉమ్మడి కుటుంబం కలిసి దూర ప్రయాణాలు చేయడానికి అనుగుణంగా ఉండనున్నాయి. అంతేకాకుండా ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు అమర్చారు మరి ఈ మూడు కార్ల వివరాల్లోకి వెళ్తే..
MPV సెగ్మెంట్లో 7 సీటర్ కారు కావాలని అనుకునే వారికి నిస్సాన్ కంపెనీ కొత్త కారు గురించి ఆలోచించవచ్చు అని అంటున్నారు. ఇప్పటికే నిస్సాన్ కంపెనీ మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. ఈ కారులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. 72 బీహెచ్పీ పవర్ తో ఉండే ఈ కారు త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ ను ఉపయోగిస్తారు. ఇవే కారుకు హైలెట్గా నిల్వలు ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ రోజులు ఇవి. దీనిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఈవి లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా విన్ఫాస్ట్ అనే కంపెనీ లెమో గ్రీన్ అనే కారును త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో ఉండే బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 450 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇందులో 80 kWh ఫాస్ట్ చార్జర్ తో కేవలం 30 నిమిషాల్లోనే 10 నుంచి 70% వరకు చార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది తక్కువ ధరలోనే లభ్యం కావడంతో చాలామంది దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
ఖరీదైన కార్లు కొనాలని అనుకునే వారికి ఇది శుభవార్త. ఈ ఏడాది మార్చి మూడున మార్కెట్లోకి కొత్త ఎస్ యు వి రానుంది. అదే మెర్సీ డేస్ బెంజ్ వి క్లాస్. ఇందులో విశాలమైన క్యాబిన్ తో పాటు ప్రీమియం లుక్ ను అందించే సీట్లు అమర్చబడ్డాయి. ఈ ఇంజన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 158 bhp పవర్ ను అందిస్తుంది.
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version