Devotional Tips: మన పూర్వీకులలో చాలామంది తల్లీదండ్రులు పుణ్యకార్యాలు చేసినా పాపకార్యాలు చేసినా వాటి ప్రభావం పిల్లలపై ఉంటుందని వెల్లడించారనే సంగతి తెలిసిందే. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న విషయాల ప్రకారం తల్లీదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుందని దానిని జాతకంలో స్త్రీ శాపం, పితృశాపం అంటారని చెబుతున్నారు. ఫ్యామిలీలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగిలే అవకాశాలు ఉంటాయి.
భవిష్యత్తు తరాలకు సైతం స్త్రీ శాపం సంక్రమించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పితృ దేవతలకు శ్రాద్ధం నిర్వహించని పక్షంలో పితృ శాపం సంక్రమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ శాపాల వల్ల పిల్లలు లైఫ్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. చేసే వ్యాపారాలలో నష్టాలు రావడం, ఉద్యోగం రాకపోవడం జాబ్ వచ్చినా అభివృద్ధి లేకపోవడం, లైఫ్ లో ఎదుగుదల లేకపోవడం ఇందుకు సంబంధించి ఉదాహరణలుగా చెప్పవచ్చు.
Also Read: Pawan Kalyan New Movie: KGF డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. సంబరాల్లో ఫాన్స్
పూర్వీకులు ఏవైనా పాపాలు చేస్తే తర్వాత తరాలు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కుటుంబంలో ఎవరైనా చెడు అలవాట్లకు బానిసలు అయితే తర్వాత తరం వాళ్లను వ్యాధులు వేధించే అవకశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. ఎప్పుడూ ఇతరులకు మంచి చేయడం, పుణ్యకార్యాలు చేయడం ద్వారా భవిష్యత్తు తరాలు కూడా సంతోషంగా జీవనం సాగించే ఛాన్స్ అయితే ఉంటుంది.
తల్లీదండ్రులు ధర్మంగా జీవనం సాగిస్తే తర్వాత తరం కూడా శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. తల్లీదండ్రులు చేసిన పాపాలు ఎన్నో విధాలుగా పిల్లలకు సంక్రమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పిల్లల జీవితం బాగుండాలని అవినీతి, అక్రమాలకు పాల్పడితే మాత్రం భవిష్యత్తు తరాలు నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను భవిష్యత్తు తరాలు ఎదుర్కోక తప్పదు.
Also Read: yash: కేజీఎఫ్-2 కి యష్ ఇంత తక్కువ తీసుకున్నాడా.. తెలుగు హీరోలు ఎన్నడు మారుతారో..?