Extramarital Affair: ఆమెకు ఓ వ్యక్తితో పెండ్లియింది. కానీ ఎందుకో భర్తతో సంతోషంగా ఉండలేకపోయింది. చివరకు భర్త తమ్ముడిపై కన్నేసింది. కొడుకు లాంటి మరిదితో వావి వరసలు మరిచిపోయి అక్రమ సంబంధానికి తెరలేపింది. మరిదిని వలలో వేసుకుంది. ఇంకేముంది భర్త లేనప్పుడల్లా.. విచ్చల విడిగా ఎంజాయ్ చేయసాగింది. ఈ విషయం భర్తకు తెలియకుండా వదిన, మరిది జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే చివరకు తన చెల్లెలు జీవితాన్ని కూడా నాశనం చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని సబర్బన్ మణినగర్ కు చెందిన ఓ అమ్మాయికి నాలుగు సంవత్సరాల కిందట ఓ వ్యక్తితో పెండ్లియింది. కానీ భర్తతో సంతోసాన్ని పొందలేక మరిదితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆమె మరిదికి ఇంట్లో వారు పెండ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అయితే మరిది, వదిన అక్రమ సంబంధం ఎవరికీ తెలియదు.
Also Read: Telangana Govt Jobs Notification: నిరుద్యోగుల్లారా ఇది మీకోసమే.. నోటిఫికేషన్లు వచ్చేది అప్పుడే
కానీ వదిన మనసులో ఓ దురాలోచన మొదలైంది. మరిదికి వేరే అమ్మాయితో పెండ్లి జరిగితే తనను ఎక్కడ దూరం పెడతాడో అని.. తన చెల్లెలితోనే పెండ్లి చేయాలని నిశ్చయించుకుంది. అలా జరిగితే మరిది తన కంట్రోల్ లో ఉంటాడని అనుకుని చెల్లులుతో పెండ్లి చేసింది. ఇంకేముంది పెండ్లి తర్వాత కూడా వారి అక్రమ సంబంధం అలాగే కొనసాగించారు.

కానీ వీరిద్దరూ చనువుగా ఉండటాన్ని గమనించిన ఆమె చెల్లులు.. మొదట్లో లైట్ తీసుకుంది. కానీ రాత్రి వేళల్లో తన భర్త తనను పక్కన పెట్టేసి.. వదిన దగ్గరకు వెళ్లడం ఆమె చూసింది. ఇంకేముంది ఈ విషయాన్ని కుటుంబీకులకు, పెద్దలకు చెప్పింది. కానీ వారు పరువు పోతుందని చెప్పొద్దంటూ సూచించారు. కానీ వారి ఆగడాలు మరీ ఎక్కువ కావడంతో చేసేది లేక చివరకు అక్క భర్తకు అంటే బావకు విషయం చెప్పింది. కానీ ఆయన ఏం చేయలేని నిస్సహాయుడయ్యాడు.
ఇక వారి దురాగతాన్ని అడ్డుకోవాలని చివరకు అభయం హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. తనకు కౌన్సిలర్ల నుంచి సాయం కావాలని అడిగింది. అయితే వారు కుటుంబం మొత్తానికి కౌన్సిలింగ్ అవసరం అంటూ సూచించారంట. ఈ విషయం ఇప్పడు వైరల్ అవుతోంది.
Also Read:Illegal Relationship: తల్లీ, కూతుర్ల అరాచకం.. ఒకే వ్యక్తితో అక్రమ సంబంధం.. డబ్బుల కోసం చివరకు