Disti Bomma: మనం ప్రతి ఇంటి ముందు దిష్టిబొమ్మను చూస్తుంటాం. చాలామంది తమ ఇంటిపై నరదృష్టి పడకుండా దీనిని ఏర్పాటు చేసుకుంటారు. ఇలాంటి ఇల్లు అయినా దిష్టిబొమ్మ ఒకే రకంగా ఉంటుంది. అయితే ఈ దిష్టిబొమ్మ ఎవరు అన్న ఆలోచన ఇంతవరకు ఎంతమందికి వచ్చింది? అసలు ఈ దిష్టిబొమ్మ ఇంటి ముందు ఏర్పాటు చేసుకోవాలని ఎవరు చెప్పారు? చిన్న ఇల్లు నుంచి బహుళ అంతస్తుల గల భవనానికి సైతం ఈ దిష్టిబొమ్మ ఎందుకు ఉంటుంది? ఇలాంటి వివరాల కోసం ఈ కింది స్టోరీకి వెళ్ళండి.
కొన్ని పురాణాల ప్రకారం జలంధరుడు అనే రాక్షసుడు చేత ప్రజలు పీడింపబడ్డారు. బ్రహ్మదేవుడు ఇచ్చిన ఒక వరంతో జలంధరుడు మూడు లోకాలను తన ఆధీనంలోకి తీసుకొచ్చి దేవతలకు రాజు అయిన ఇంద్రుడుని సైతం భయపెట్టాడు. దీంతో ప్రజలు, దేవుళ్ళు తీవ్ర ఆందోళన చెంది చివరకు నారదుడి వద్దకు సలహా కోసం వెళతారు. అయితే నారదుడు అప్పుడు జలంధరుడు దగ్గరికి వెళ్లి.. నువ్వు ఎన్ని గెలిచినా శివుడు దగ్గర పేడ పురుగుతో సమానం అని అంటాడు. ఎందుకంటే శివుడి వద్ద పార్వతి దేవి ఉంటుంది. ఆ అమ్మవారిని ఎవరు ఓడించలేరు అని అంటారు. దీంతో జలంధరుడికి మరింత అహంకారం పెరిగి పార్వతీ కూడా నాదే అని అంటాడు. ఈ విషయాన్ని రాహు ద్వారా శివుడుకు వర్తమానం పంపుతాడు.
అయితే శివుడు వద్దకు వెళ్లిన రాహువు జలంధరుడు చెప్పిన విషయాన్ని చెబుతాడు. దీంతో తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న శివుడు మూడో కన్ను తెరుస్తాడు. ఆ కంటి నుంచి కీర్తిముఖుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. ఈ కీర్తిముఖుడు రాహును తినబోతుంటే.. అప్పుడు తాను కేవలం జలంధరుడు చేసిన వర్తమానం మాత్రమే తీసుకొచ్చానని చెబుతాడు. అయితే అప్పుడు శివుడు శాంతించి రాహువుకు ప్రాణ దీక్ష పెడతాడు. ఆ తర్వాత కీర్తిముఖుడికి తీవ్రమైన ఆకలి వేస్తుంది. అప్పుడు శివుడి వద్దకు వెళ్లి తనకు తీవ్రమైన ఆకలి వేస్తుందని ఎవరిని తినాలి అని అడుగుతాడు. అప్పుడు శివుడు నీకు నువ్వే తిను అని అంటాడు. దీంతో కీర్తిముఖుడు తనకు తానే తినడం మొదలు పెడతాడు. అయితే శరీర భాగం మొత్తం తిన్న అతడు మొహం మాత్రం అలాగే ఉండిపోతుంది. శివుడు తాను చెప్పిన మాటను ఆజ్ఞాపించినందుకు కీర్తిముఖుడికి ఒక వరం ఇస్తాడు. ప్రతి ఇంటి ముందు కీర్తి ముకుడి తల ఉంటుందని.. ఈ తల ఉండడం వల్ల ఎలాంటి నరదృష్టి అయినా తట్టుకునే శక్తి కీర్తిముఖుడికి శివుడు వరం ఇస్తాడు.
అప్పటినుంచి ప్రతి ఇంటి ముందు కీర్తిముఖుడి తలను దిష్టిబొమ్మలాగా తగిలించుకుంటారు. ఇది ఉన్న ఏ ఇంటికి నరదృష్టి లేదా ఇతర చెడు చూపు పడకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇల్లును ప్రారంభించే వారు ఈ దిష్టిబొమ్మను తప్పకుండా ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత కూడా దిష్టిబొమ్మను ఉంచుతారు.