Homeఆంధ్రప్రదేశ్‌Business Reformer Of The Year : చంద్రబాబుకు అరుదైన పురస్కారం.. లోకేష్ తండ్రోత్సాహం!

Business Reformer Of The Year : చంద్రబాబుకు అరుదైన పురస్కారం.. లోకేష్ తండ్రోత్సాహం!

Business Reformer Of The Year: నారా లోకేష్( Minister Nara Lokesh) అనుకున్నట్టుగానే సంచలన ప్రకటన చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించినట్లు ప్రకటించారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధంగా ఉండండి అంటూ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎకనమిక్ టైమ్స్ పత్రిక బిజినెస్ రిఫార్మర్ ఇన్ ఇయర్ గా ప్రకటించినట్లు నారా లోకేష్ వెల్లడించారు.. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఏటా ఎకనమిక్ టైమ్స్ ఈ అవార్డును ప్రకటిస్తూ వస్తోంది. ఆర్థిక గణాంకాలను పరిగణలోకి తీసుకొని.. ఆ దిశగా కృషి చేసే వారికి ఈ అవార్డు లభిస్తూ వస్తోంది. వ్యవసాయాన్ని మరింత సరళతరంగా, వ్యాపారంగా మార్చి.. విజయవంతమైన రంగంగా తీర్చిదిద్దే వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తూ వస్తోంది ఎకనామిక్ టైమ్స్. ఈ ఏడాది ఏపీ సీఎం చంద్రబాబు కు అందించాలని నిర్ణయించడం నిజంగా శుభ పరిణామం. మొన్ననే నారా బ్రాహ్మణికి జాతీయ పురస్కారం దక్కగా… ఇప్పుడు చంద్రబాబుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎకనామిక్ టైమ్స్ పత్రిక బిజినెస్ రిఫార్మర్ అవార్డు ప్రకటించడం విశేషం.

అన్ని రంగాలకు ఊతం
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం లభించింది. ప్రధానంగా ప్రకృతి, సేంద్రియ విధానం పాటించే వారికి ప్రోత్సాహం అందుతోంది. తక్కువ పెట్టుబడి తో ఎక్కువ ఆదాయం పొందే మార్గాలు సూచిస్తోంది ప్రభుత్వం. పండించిన పంటకు మద్దతు ధరతో పాటు గిట్టుబాటు కలిగేలా బాధ్యత తీసుకుంటుంది. ఇవన్నీ సత్ఫలితాలు ఇస్తూ వచ్చాయి. ప్రధానంగా ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్( Google data centre) విశాఖలో ఏర్పాటు కానుంది. దానికోసం దేశంలో వివిధ రాష్ట్రాలు ప్రయత్నాలు చేశాయి. కానీ ఆ సంస్థ ఏపీ వైపు వెళ్లడానికి ప్రధాన కారణం సిఎం చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు సైతం పెద్ద ఎత్తున వస్తున్నాయి. తయారీ రంగంలో రాయలసీమలో పెట్టుబడులు పెడుతుండగా ఐటి పరంగా విశాఖలో పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. వైసిపి పాలనకు భిన్నంగా చంద్రబాబు పాలన సాగుతోంది. అది కళ్లెదుటే కనిపిస్తోంది. వీటన్నింటినీ గుర్తించిన ఎకనామిక్ టైమ్స్ చంద్రబాబుకు అవార్డుకు ఎంపిక చేసింది.

పత్రికకు సుదీర్ఘ చరిత్ర..
ఎకనామిక్ టైమ్స్( Economic Times) పత్రికకు సుదీర్ఘ చరిత్ర ఉంది. గత ఐదు దశాబ్దాలుగా ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ ఫైనాన్స్, షేర్ మార్కెట్ లు వంటి వాటిపై విశ్లేషణాత్మక కథనాలు ప్రచురిస్తూ వస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా చదివే జాబితాలో ఈ పత్రిక ఉంది. ప్రపంచంలోనే ఎక్కువమంది చదివే రెండో ఆంగ్ల పత్రిక ఇది. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలతో పాటు పారిశ్రామిక ప్రతినిధులు ఎక్కువమంది ఈ పత్రికను అనుసరిస్తుంటారు. భారత ఆర్థిక వ్యవస్థ పై సమగ్ర అవగాహనతో కూడిన కథనాలను ప్రచురిస్తూ ఉంటుంది ఈ పత్రిక. అందుకే యువ పారిశ్రామికవేత్తలు ఎప్పుడూ ఈ పత్రికను ఫాలో అవుతుంటారు. అటువంటి పత్రిక ఏపీ సీఎం చంద్రబాబును గుర్తించడం.. ఈ ఏడాదికి అవార్డు ప్రకటించడం నిజంగా గొప్ప విషయం. అయితే లోకేష్ మధ్యాహ్నం 12 గంటల ప్రకటన అనేసరికి రకరకాల చర్చ నడిచింది. క్రీడాంశాలకు సంబంధించిన వార్త అయి ఉంటుందని అందరూ అంచనా వేశారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా లోకేష్ ట్వీట్ చేశారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version