Kids footwear safety: సమాజంలో గౌరవంగా కనిపించాలని కొందరు.. స్టైలిష్ గా ఆకట్టుకోవాలని కొందరు.. ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎదుటివారిని ఆకట్టుకోవడానికి అందమైన దుస్తులను.. ఆకర్షించే చెప్పులను వేసుకుంటారు. అయితే ఒక శరీరానికి దుస్తులు ఎంత ముఖ్యమో చెప్పులు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి బరువు మొత్తం చెప్పుల పైన ఆధారపడుతుంది. దీంతో ఇవి కాళ్లకు రక్షణ ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వగలుగుతాయి. ఇలాంటప్పుడు శరీరానికి ఆరోగ్యకరమైన చెప్పులను మాత్రమే ధరించాలి. కానీ ఇటీవల చాలామంది పెద్దవారితో సహా చిన్న పిల్లలు Crocks వాడుతున్నారు. చూడడానికి స్టైలిష్ గా ఉండే ఇవి వాడడం వల్ల పిల్లలకు ఎంత ప్రమాదమో తెలుసా?
ప్రస్తుత కాలంలో పెద్దవారితో పాటు పిల్లలు కూడా ఎదుటివారిని ఆకట్టుకునేలా ఉండాలని ఆకర్షణీయమైన చెప్పులను కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సమాజంలో ఎటువంటి ట్రెండ్ నడుస్తుందో దానికి అనుగుణంగా చెప్పులను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం పై పట్టించుకోవడం లేదు. మార్కెట్లో ప్రస్తుతం ఎక్కువగా కనిపించే క్రాక్స్ ను చాలామంది కొనుగోలు చేస్తున్నారు. ఇది పెద్దవారితో పాటు చిన్న పిల్లలకు కూడా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ చెప్పులను పెట్రో కెమికల్స్ తో పాటు EVA ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. ఇవి ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల వీటి నుంచి ప్రమాదకరమైన రసాయనాలు వెలువడుతాయి. వీటినే VOC అని అంటారు. ఇది బాగా ఎండలో ఉండడంవల్ల ఎక్కువగా రిలీజ్ అయి చర్మ సంబంధిత సమస్యలు వచ్చి ఆ తర్వాత క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంటుంది.
అయితే చిన్నపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే పాదాల కింద బ్రెయిన్, హార్ట్,కిడ్నీ అవయవాల పనితీరును మెరుగుపరిచే కణాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో ప్రమాదకరమైన వాయువులను రిలీజ్ చేసే ఈ చెప్పులను వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దవారితో పోలిస్తే చిన్న పిల్లల స్కిన్ కు ఇది ఎక్కువగా ప్రమాదకరంగా మారుతుంది. అంతేకాకుండా కొందరు సైంటిస్టులు చెబుతున్న ప్రకారం.. ఈ చెప్పులు చాలా స్మూత్ గా ఉండి కాళ్లకు కంఫర్ట్ గా ఉండలేక పోతాయి. దీంతో కాళ్లకు కనెక్ట్ అయ్యే నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు.
అయితే వీటిని పూర్తిగా నిషేధించాలా? అంటే అవసరం లేదు అని కొందరు అంటున్నారు. ఎందుకంటే వీటిని ఎండలో ఎక్కువసేపు వాడితే మాత్రమే ప్రమాద రసాయనాలు వెలువడుతాయి. ఎండలోకి వెళ్లకుండా ఇంట్లో వరకు వీటిని వాడుకోవచ్చు. ఆకర్షణీయంగా కనిపించాలని అనేవారు వీటిని సూర్య రష్మి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో యూస్ చేసుకోవచ్చు. అయితే చిన్నపిల్లలకు వీటిని దూరంగా ఉండటమే సేఫ్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.