IPL 2025 Mega Auction : ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 14.2 0 కోట్లకు ఓ ఆటగాడిని కొనుగోలు చేసింది. అతడు అన్ క్యాప్డ్ ప్లేయర్. అయినప్పటికీ ఆ స్థాయిలో ధర చెల్లించడం వెనుక చాలామంది ఆశ్చర్యపోయారు.. అయితే చెన్నై జట్టు అతడికి అంత ధర చెల్లించడం సబబే అనిపిస్తోంది. ఇంతకీ ఆటగాడు ఎవరు? అతని ప్రత్యేకత ఏమిటంటే?
టీమిండియాలో ఎంతోమంది ఆల్రౌండర్లు ఉన్నారు. భవిష్యత్తు కాలంలోనూ పుట్టుకొస్తారు.. వారిలో రవీంద్ర జడేజా కు ముందు వరస స్థానం ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలలో అతడు అద్భుతాన్ని ప్రదర్శించగలడు.. అయితే ఇప్పుడు అతడి స్థానాన్ని అందుకో గల ఆటగాడు పుట్టుకొచ్చాడు. అతడి పేరు ప్రశాంత్ వీర్. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇతడిని 14.2 0 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రశాంత్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న అన్ క్యాప్డ్ ఆటగాడిగా ప్రశాంత్ రికార్డు సృష్టించాడు.
ప్రశాంత్ తండ్రి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శిక్ష మిత్రగా పనిచేస్తాడు.. అతడికి వచ్చే జీతం ప్రశాంత్ కుటుంబ సభ్యులను సాకడానికి సరిపోయేది కాదు. దీంతో ఒకానొక సందర్భంలో ప్రశాంత్ క్రికెట్ నుంచి వెళ్లిపోదామనుకున్నాడు. ఈ క్రమంలో కొంతమంది దాతలు అతడికి సహకరించారు. గతంలో అనేక సందర్భాల్లో కూడా ప్రశాంత్ క్రికెట్ నుంచి తప్పుకోవాలనుకున్నాడు. అయితే 2019లో అతడిని ఒక సంఘటన తీవ్రంగా ప్రభావితం చేసింది.
మెయిన్ పూరి స్పోర్ట్స్ హాస్టల్లో రక్షిత్ గర్గ్ అనే యువకుడు శిక్షణ పొందుతూ ఉండేవాడు. అయితే అక్కడ పరిస్థితులను చూసి తట్టుకోలేక అతడు సహారాన్పూర్ వెళ్లిపోయాడు.. అక్కడ అతడికి ప్రశాంత్ పరిచయమయ్యాడు.. ఇద్దరి అభిరుచులు కలవడంతో.. ప్రశాంత్ ను తన చిన్ననాటి కోచ్ రాజీవ్ గోయల్ కు పరిచయం చేశాడు.. ఆ తర్వాత ప్రశాంత్ ను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. ప్రతిరోజు ప్రశాంత్, గార్గ్ సైకిల్ మీద కోచింగ్ వెళ్లేవారు. ఆ తర్వాత గార్గ్ ఉత్తర ప్రదేశ్ అండర్ 16 జట్టుకు ఎంపిక అయ్యాడు. మొదట్లో ప్రశాంత్ గొప్పగా ఆడేవాడు కాదు..
గార్గ్ ఉత్తరప్రదేశ్ అండర్ 16 జట్టుకు ఎంపికైన తర్వాత ప్రశాంత్ తన దృక్పథాన్ని మార్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్ అండర్ 19 జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత అతడు దినదిన ప్రవర్తమానంగా ఎదిగాడు. చివరికి 2022 -23 కుచ్ బేహర్ ట్రోఫీలో ఉత్తర ప్రదేశ్ తరఫున హైయెస్ట్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చోటు సంపాదించుకున్నాడు.. అవుట్ ఆఫ్ ది పార్క్ సిక్సర్ల వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. యూపీ టి20 లీగ్ లో నోయిడా జట్టు తరఫున ఆడాడు. మూడో సీజన్ నాటికి అతడు ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2025 లో 320 పరుగులు చేశాడు. అంతేకాదు 8 వికెట్లు కూడా పడగొట్టాడు.
ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో అదే జోరు కొనసాగిస్తున్నాడు. 169.69 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్, 6.76 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు. ఏడు రోజుల వ్యవధిలో అటు సీనియర్ జట్టు, ఇటు అండర్ 23 జట్ల మధ్య 6 మ్యాచ్లు ఆడి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ప్రశాంత్ ఈ స్థాయిలో పేరు సంపాదించినప్పటికీ అతడు ఇప్పుడు ఆనందంగా లేడు.. ఒకప్పుడు తనకు అండగా నిలిచిన గార్గ్ తన తల్లిదండ్రులను కోల్పోయాడు. కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకోవడంతో క్రికెట్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం గార్గ్ సహారాన్పూర్ ప్రాంతంలో ఓ క్రీడా వస్తువుల దుకాణాన్ని మొదలుపెట్టాడు. ప్రశాంత్ ఈ స్థాయిలో పేరు తెచ్చుకోవడం పట్ల గార్గ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇది తన సోదరుడు సాధించిన విజయంగా పేర్కొంటున్నాడు. అంతేకాదు చెన్నై జట్టు తనును అంత ధరకు కొనుగోలు చేసిన తర్వాత తల్లిదండ్రుల కంటే ముందుగా ప్రశాంత్ గార్గ్ కు వీడియో కాల్ చేశాడు.