Pulivendula Medical College: జగన్ పాలన అంటే మసిబూసి మారేడుకాయను చేయడమని ఇప్పుడిప్పుడే ఏపీ ప్రజలకు అర్థమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన ప్రతి పనిని వేలెత్తి చూపించి నేను అద్భుతంగా చేస్తానంటూ వాగ్దానాలు, ఒట్లు వేసి ఒక్క ఛాన్స్ అన్న జగన్… ఇప్పుడు గెలిచాక మాత్రం అంతా మాయ చేసేస్తున్నారు.
ఊహా లోకాన్ని చూపించి అదిగో స్వర్గం అంటున్నారు. అది చేరేది లేదు. జనాలు బాగుపడేది లేదు. ఈ విషయం ఇప్పుడెందుకు అంటే.. గతంలో పులివెందుల బస్టాండ్ విషయంలో ఎంత పెద్ద రచ్చ జరిగిందో చూశాం. అప్పుడు బస్టాండ్ గ్రాఫిక్స్ ను చూపించి అద్భుతం అన్నారు. కట్టక ముందే గ్రాఫిక్స్ ఇలా ఉంటే.. ఇంక కట్టిన తర్వాత ఇంకెలా ఉంటుందో అని ప్రచారం మొదలెట్టారు. అయితే మూడేండ్ల తర్వాత ఇప్పుడు అక్కడ కేవలం పూరి గుడిసె మాత్రమే ఉంది.
దీంతో రగిలిపోయిన జనాలు.. దాన్ని ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేశారు. జగన్ పాలన అంటే ఇలాగే గ్రాఫిక్స్ లాగా ఉంటుందంటూ.. రియాలిటీ ఈ గుడిసె అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కాగా ఇప్పుడు అంతకు మించిన మిస్టరీ ఒకటి మెడికల్ కాలేజీ విషయంలో బయటపడింది. పులివెందులలో మెడికల్ కాలేజీ కట్టించాలని జగన్ నిర్ణయించడంతో.. అధికారులు భూ సేకరణ చేశారు.
Also Read: Bandi sanjay- Aravind: ఎమ్మెల్యే సీటుపైనే సంజయ్, అరవింద్ ఆశలు.. ఇవన్నీ అడ్డంకులే..!
ఇక్కడ ఓ ట్విస్టు ఏంటంటే.. మెడికల్ కాలేజీ కట్టడానికి అసలు పర్మిషనే ఇంకా రాలేదు. కానీ అప్పుడే భూ సేకరణ అంటూ హడావిడి చేశారు. కానీ భూమి తీసుకున్న వారికి ఇంకా పూర్తిగా డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు బయటపడింది. వెలమవారిపల్లెలో నివసిస్తున్న కె.మునిస్వామినాయుడు భూమిని కూడా మెడికల్ కాలేజీ కోసం తీసుకున్నారు.
1.50ఎకరాల భూమి తీసుకుని కేవలం 83 సెంట్లకు పరిహారం ఇచ్చారు. 67సెంట్లకు రావాల్సిన రూ.31.55 లక్షలను ఇవ్వాలని ఎన్ని సార్లు కలెక్టర్లు, ఎస్పీల చుట్టూ తిరగినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో ఆయన చేసేది లేక ఇలా అయితే కుదరదని ధైర్యం చేశారు. తన భూమిలో అధికారులు నిర్మించిన రేకుల షెడ్డును ఎక్సకవేటర్ తో పీకిపారేశారు. సెక్యూరిటీ మరో షెడ్డును కూడా కూల్చేశారు.
ఈ విషయం చుట్టు పక్కల వారికి తెలియడంతో పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి. దీంతో అధికారులు అతన్ని పిలిచి.. 15 రోజుల్లో ఇస్తామంటూ బతిమాలారంట. ఒకవేళ అతను చేసింది తప్పు అంటూ కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ దానికి కొంచెం టైమ్ పట్టొచ్చు. కానీ చేసిన తప్పులను మాత్రం ఇలా కప్పి పుచ్చుకోవాలని చూస్తే ఎలా.