https://oktelugu.com/

oldage : ఈ ఆరింటి వల్ల తర్వగా ముసలితనం వచ్చేస్తుందట?

మారిన జీవన శైలి. ఎందుకు అంటే కంట్రోల్ లేకుండా ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఆరు వస్తువులని తీసుకోవడం వల్ల తొందరగా ముసలితనం వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ ఆరు పదార్థాలు ఏంటో మరి చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 8, 2024 1:41 pm
    Quickoldage

    Quickoldage

    Follow us on

    oldage : వయస్సు పెరిగిన కూడా యంగ్ గా కనిపించాలని చాలా మంది అనుకుంటారు. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వయస్సు ఎక్కువ ఉన్నా కూడా అందరిలో యంగ్ గా కనిపించాలని భావిస్తారు. అయితే ముసలితనం రాకుండా యంగ్ గా ఉండాలంటే.. సరైన నియమాలు పాటించాలి. తినే ఫుడ్ నుంచి అన్నిటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. యంగ్ గా ఉండాలని చాలా మంది యోగా, వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేస్తుంటారు. అయితే కేవలం ఇవి మాత్రమే చేస్తే యంగ్ గా కనిపించరు. సరైన ఆహారం తీసుకోవడంతో పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలి. ఈరోజుల్లో చాలా మంది కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. వీటి వల్ల అనారోగ్య సమస్యలు రావడంతో పాటు తొందరగా ముసలితనం వస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం చాలా మందకి తొందరగా ముసలితనం వస్తుంది. దీనికి ముఖ్య కారణం.. మారిన జీవన శైలి. ఎందుకు అంటే కంట్రోల్ లేకుండా ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఆరు వస్తువులని తీసుకోవడం వల్ల తొందరగా ముసలితనం వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ ఆరు పదార్థాలు ఏంటో మరి చూద్దాం.

    మద్యపానం
    మద్యపానం తాగడం ఆరోగ్యానికి హానికరం. దీనిని అధికంగా తాగడం వల్ల బాడీ తొందరగా డీ హైడ్రేట్ అవుతుంది. దీని వల్ల చర్మంపై తొందరగా ముడతలు వస్తాయి. స్కిన్ గ్లో తగ్గిపోయి.. ముఖం చాలా డల్ గా మారుతుంది. ఎంత యంగ్ గా ఉన్నా కూడా తొందరగా ముసలితనం వస్తుందని నిపుణులు అంటున్నారు.

    ధూమపానం
    కేవలం మద్యం మాత్రమే కాకుండా ధూమపానం చేసిన కూడా తొందరగా ముసలితనం వస్తుంది. ప్రస్తుతం చాలా మంది చిన్న వయస్సు నుంచే సిగరెట్ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. మారిన జీవన శైలి, వర్క్ టెన్షన్ వల్ల చాలా మంది దీనికి బానిస అవుతున్నారు.

    యువీ కిరణాలు
    సాధారణంగా ఒక్కరోజు ఎండలో బయటకు వెళ్తే.. నల్లగా అయిపోతారు. చర్మ రంగు మారిపోవడంతో పాటు ముఖంలో కల కూడా పోతుంది. తొందరగా చర్మంపై ముడతలు వచ్చి.. ముసలితనం వస్తుంది.

    అధికంగా డిహైడ్రేషన్ కి గురికావడం
    యంగ్ గా ఉండాలంటే నీరు తాగడం చాలా ముఖ్యం. కొందరు నీరు తక్కువగా తాగడం వల్ల బాడీ డిహైడ్రేషన్ కి గురవుతుంది. దీంతో బాడీలో మార్పులు వచ్చి తొందరగా ముసలితనం వస్తుంది.

    ప్రాసెస్డ్ ఫుడ్
    ఈరోజుల్లో చాలా మంది ఇంట్లో వండిన ఫుడ్ కంటే బయట ఫుడ్ ఎక్కువగా తింటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలతో పాటు.. చర్మంపై ముడతలు తొందరగా వస్తాయి.

    చక్కెర పదార్థాలు
    ప్రస్తుతం యువత పేస్ట్రీ వంటివి ఎక్కువగా తింటున్నాయి. చక్కెర వంటి పదార్థాలు ఎక్కువగా తింటే తొందరగా ముసలితనం వస్తుంది.

    ఒత్తిడి
    వ్యక్తిగత సమస్యలు, వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల కొందరు అధికంగా ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల తొందరగా ముసలితనం వస్తుందని నిపుణులు అంటున్నారు.