https://oktelugu.com/

Mathu Vadalara 2 : ట్రైలర్ లాంచ్ కోసం వచ్చిన ‘మత్తు వదలరా 2’ టీం ని సెక్యూరిటీ తో బయటకి గెంటించేసిన ప్రభాస్..వైరల్ అవుతున్న వీడియో!

ప్రభాస్ ని మాటల్లో పెట్టి కాలక్షేపం చేయడానికి టీం మొత్తం ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది, అప్పుడు చిరాకెత్తిపోయిన ప్రభాస్, 'సెక్యూర్టీ వీళ్ళను బయటకి తోసేయండి' అని అంటాడు, ఆ తర్వాత ఏమి జరిగిందో ఈ క్రింది వీడియో లో చూసేయండి.

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2024 / 09:57 PM IST

    Prabhas escorting the 'Mathu Vadalara 2'

    Follow us on

    Mathu Vadalara 2టాలీవుడ్ మంచి అభిరుచి తో పాటు, వినూతనమైన కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే దర్శకుడిగా యూత్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్న వారిలో ఒకరు రితేష్ రానా. ఈయన దర్శకత్వం లో వచ్చిన ‘మత్తు వదలరా’ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి కొడుకు శ్రీ సింహా ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. అంతకు ముందు శ్రీ సింహా ఎన్టీఆర్ ‘యమదొంగ’ చిత్రంలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రని పోషించాడు. ఆ పాత్రకి అప్పట్లో మంచి పేరు కూడా వచ్చింది. ఇక శ్రీ సింహా హీరో గా లాంచ్ అవుతున్నాడు అనగానే జూనియర్ ఎన్టీఆర్ ‘మత్తు వదలరా’ చిత్రానికి ప్రొమోషన్స్ కూడా చేసాడు. ఇప్పుడు ‘మత్తు వదలరా 2 ‘ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రొమోషన్స్ చేస్తున్నాడు. నేడు ఈ సినిమా ట్రైలర్ ని ఆయన లాంచ్ చేసాడు.

    మామూలుగా రిలీజ్ చేయకుండా, ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ఈ ట్రైలర్ ని లాంచ్ చేసాడు ప్రభాస్. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ అభిమానులను తెగ నవ్విస్తుంది. ఈ వీడియో లో ముందుగా ఒక్క పెద్ద గుంపు రూమ్ లో చేరి ‘స్టార్ అంటే రెబల్ ఏ రా..రెబల్ అంటే రాజే రా’ అనే నినాదాలతో డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అప్పుడే ప్రభాస్ డోర్ తీసి హాయ్ సింహా, ఏంటి ఇంతమందిని వేసుకొచ్చావు అని అంటాడు. అప్పుడు సింహా నేను చెప్తూనే ఉన్నాను సార్, కానీ వీళ్ళే మీరు వస్తున్నారు కదా అని వచ్చేసారు అని అంటూ అందరినీ తరిమేస్తాడు. ఇక ప్రభాస్ రాగానే కమెడియన్ సత్య ప్రభాస్ ని చూసిన ఆనందంలో అరుస్తూ ఉంటాడు. అప్పుడు ప్రభాస్ ‘వేడిని బయటకెళ్ళి ఆడుకోమని చెప్పు’ అని అంటాడు. ఇక ట్రైలర్ లాంచ్ చేద్దామా అని ప్రభాస్ అనగానే హీరో శ్రీ సింహా,కమెడియన్ సత్య నేను చూపిస్తాను రా అని ల్యాప్ టాప్ ని లాగుకుంటారు,చివరికి సత్య చేతికి అందుతుంది.

    సత్య ల్యాప్ టాప్ ఓపెన్ చేసి ఒక్క పెద్ద ప్రోగ్రాం కోడ్ ని టైపు చేస్తాడు. అప్పుడు ట్రైలర్ తెరుచుకొని బ్రౌజ్ అవుతూ ఉంటుంది, ఎంతసేపు అయినా ట్రైలర్ ప్లే అవ్వదు, అప్పుడు ప్రభాస్ ఇది ఈరోజుటికి ప్లే అవుతుందా అని అంటాడు, ట్రైలర్ ఎలాగో లాంచ్ అవ్వడానికి లేట్ అవుతుంది కాబట్టి, నేను పాట పాడుతాను సార్ అని ఫైరా అబ్దుల్లా పైకి లేస్తుంది. ఆమెని చూడగానే షాక్ అయిన ప్రభాస్, ఈమేంట్రా ఇంతుంది అని అంటాడు. అప్పుడు ప్రభాస్ ని మాటల్లో పెట్టి కాలక్షేపం చేయడానికి టీం మొత్తం ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది, అప్పుడు చిరాకెత్తిపోయిన ప్రభాస్, ‘సెక్యూర్టీ వీళ్ళను బయటకి తోసేయండి’ అని అంటాడు, ఆ తర్వాత ఏమి జరిగిందో ఈ క్రింది వీడియో లో చూసేయండి.