Protein Rich Meals: ప్రస్తుత కాలంలో ఎక్కడా చూసినా కల్తీ ఆహారమే దర్శనమిస్తుంది. బయట ప్రదేశాల్లో ఏదైనా ఆహార పదార్థం తినాలంటే భయం వేస్తుందని కొందరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఆహారంలో వారు వాడే పదార్థాలు దాదాపు కల్తీమయంగా ఉంటాయని కొందరు చెబుతున్నారు. అయితే అన్నిచోట్ల కల్తీ ఉండకపోవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల పదార్థాలు ఇంట్లో ప్రత్యేకంగా చేసుకొనే అవకాశం ఉండదు. రుచికరమైన ఆహార పదార్థాలను సేవించాలని కోరిక ఉన్నవారు.. బయట ప్రదేశాల్లో మాత్రమే అనుగుణంగా ఉంటుంది. అయితే నాణ్యమైన, క్వాలిటీ ఫుడ్ సెంటర్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. వీటిలో ముఖ్యంగా బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బిర్యానీ పై కొందరికి అపోహాలు ఉన్నాయి. కానీ బిర్యానీని తప్పనిసరిగా తినాలని అంటున్నారు. ఎందుకంటే?
కొంతమంది బిర్యాని అనగానే భయపడిపోతుంటారు. మరికొందరికి మాత్రం నోట్లో నీళ్లు ఊరుతాయి. కానీ బిర్యాని తినాలని కోరిక ఉన్నప్పుడు వెంటనే తినేయడమే మంచిది. ఎందుకంటే బిర్యానీలో అనేక రకాల పదార్థాలు కలిసిపోతాయి. ఇందులో రైస్ తో పాటు.. మసాలాలు, చికెన్ లేదా మటన్ తో కలిపి బిర్యాని తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల సాధారణ ఆహారం కంటే అధికమైన ప్రోటీన్లు కలిగిన పదార్థం తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల అదనపు ఎనర్జీ లభించే అవకాశం ఉంటుంది.
Also Read:
బిర్యానీలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అలాగే ఇందులో కాజుతో కూడి ఉంటే ప్రోటీన్లు లభిస్తాయి. ఇలా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఒకేసారి కలిపి తినడం వల్ల శరీరంలో కొత్త శక్తి వస్తుంది. దీంతో కండరాలన్నీ పటిష్టంగా మారుతాయి. అప్పటివరకు సాధారణ ఆహారం తీసుకున్న వారు.. బిర్యానీని తీసుకున్న తర్వాత వారి శరీరంలో కొత్త మార్పులు చూడొచ్చు. అంతేకాకుండా బిర్యాని తిన్న రోజు ఎంతో యాక్టివ్గా ఉండగలుగుతారు. రుచికరమైన బిర్యాని తినడం వల్ల తర్వాత రోజు కూడా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అందుకు కారణం ఇందులో ఉన్న పదార్థాలు శరీరానికి అదనపు శక్తిని అందిస్తాయి.
అయితే జీర్ణక్రియ, తదితర సమస్యలు ఉన్నవారు బిర్యాని అంటే భయపడిపోతుంటారు. అయితే ప్రతిరోజూ లేదా ఎక్కువసార్లు కాకుండా వీకెండ్ లో బిర్యానీని తీసుకునే ప్రయత్నం చేయాలి. అయితే బయట ప్రదేశాల్లో ఆహారంపై అనుమానాలు ఉంటే.. ఇంట్లో కూడా బిర్యాని తయారు చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ఆన్లైన్లో బిర్యానిని ఎలా తయారు చేయాలో వీడియోలు ఉంచుతున్నారు. ప్రముఖ చెఫ్ లు చేసే బిర్యానిని ఇంట్లోనే తయారు చేసుకొని సంతోషంగా ఆరగించవచ్చు. కొంతమంది బిర్యాని తింటే ఏదో అవుతుందని చెబుతూ ఉంటారు. కానీ బిర్యాని తినడం వల్ల అదనపు శక్తి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా రుచికరమైన బిర్యాని తినడం వల్ల మనసు ప్రశాంతంగా మారి ఉత్సాహంగా పనిచేయగలుగుతారు.
Also Read:
కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా అల్సర్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవాలి. అది కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకుంటే మంచిది. ఇక బిర్యానీ తీసుకునేటప్పుడు ప్రశాంతంగా సమయం తీసుకుని ఆరగించాలి. లేకుంటే జీరక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.