Protein Rich Breakfast: ఉదయం లేవగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ వ్యాయామం చేసిన తర్వాత కడుపు ఆకలి కోరుతుంది. ఇలాంటి సమయంలో భోజనం చేసిన పర్వాలేదు అని అనిపిస్తుంది. కానీ పొద్దు పొద్దున్నే భోజనం చేయడం ద్వారా ఆ తర్వాత జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సమయంలో భోజనం చేయకపోయినా సాఫ్ట్ గా ఏదైనా ఒక ఆహారం కచ్చితంగా తీసుకోవాలి. ఆ తీసుకునే ఆహారం తేలికగా ఉండి.. ప్రోటీన్లు ఎక్కువగా ఇచ్చే ఆహారమై ఉండాలి. దాదాపు 12 గంటల తర్వాత ఈ ఆహారం తీసుకుంటారు. అలాంటప్పుడు ఇప్పుడు తీసుకునే ఆహారం బలవర్ధకంగా ఉంటే రోజంతా ఉత్సాహం ఉంటుంది. మరి ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
Also Read: రాత్రి ఈ ఆహారాలు తీసుకోండి.. కచ్చితంగా బరువు తగ్గుతారు..
ఉదయం టిఫిన్ చేయడం చాలా మందికి అలవాటే. కానీ కొందరు ఉదయమే రుచులు కోరుకుంటారు. ఈ సమయంలో ఆయిల్ ఫుడ్, ఇతర విషయాలను పట్టించుకోకుండా లాగేస్తుంటారు. ఉదయం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేవి అయితే శరీరం ఎనర్జీగా ఉంటుంది. అలా కాకుండా ఆయిల్ వస్తువులు తీసుకోవడం వల్ల శరీరం ఉత్సాహంగా ముందుకు వెళ్ళదు. వీటిలో ప్రధానంగా ఇడ్లీ గురించి చెప్పుకోవాలి. బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీ తీసుకోవాలని చాలామంది అనుకోరు. ఎందుకంటే ఇది టేస్టీగా ఉండదు. అంతేకాకుండా ఇది తినడం వల్ల వెంటనే ఆకలి వేస్తుంది. ఇడ్లీని ఇంట్లో తయారు చేయడం కూడా చాలా కష్టమే. అందువల్ల దీనికి ఎక్కువగా ప్రాధాన్యత అయ్యారు. కానీ ఇడ్లీ ఇడ్లీకి చట్నీని రుచికరంగా తయారు చేసుకోవచ్చు. పుట్టాల చెట్ని లేదా కూరగాయలతో నిండిన పదార్థాలను తయారు చేయడం వల్ల శరీరానికి ప్రోటీన్లు ఇచ్చిన వారవుతారు.
ఉదయం పూరి తినడానికి చాలామంది లొట్టలు వేసుకుంటారు. కొందరు రెండు ప్లేట్లకు తగ్గకుండా పూరీలు లాగేస్తారు. కానీ పూరి తినడం వల్ల రోజంతా అలసటగానే ఉంటారు. ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఆయిల్ ఫుడ్. ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఫలితంగా ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లేవారు నీరసంగా ఉండిపోతారు. అలా కాకుండా పూరికి తోడుగా ఆలూ కుర్మా కాకుండా కాలీఫ్లవర్ కర్రీ లేదా మిక్స్డ్ వెజ్ కర్రీ వంటివి తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో నూనె శాతం తగ్గే అవకాశం ఉంటుంది.అయితే పూరికి బదులు గోధుమ పిండితో తయారుచేసిన చపాతీ తినడం వల్ల కాస్త బెటర్ గా ఉంటుంది.
Also Read: కారం మరణ రేటును తగ్గిస్తుందా? ఇందులో నిజం ఎంత?
ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో దోష పర్వాలేదు అని అనిపిస్తుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకోదు. అంతేకాకుండా ఇందులో 150 క్యాలరీల శక్తి ఉంటుంది. అయితే ప్రతిరోజు దోష కాకుండా వారంలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే దోశ తిని అలవాటు చేసుకోవాలి. లేకుంటే మసాలాతో కూడిన దోష అతిగా తినడం వల్ల అల్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది.
మైసూర్ బజ్జి చూడగానే చాలామందికి నోరూరుతుంది. కానీ ఇది తినడం వల్ల ఎంత మాత్రం సేఫ్ కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మైసూర్ బజ్జి జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఇందులో 250 వరకు క్యాలరీలు ఉంటాయి. కానీ ప్రోటీన్లు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల దీని జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. అయితే రుచి కోసం ఎప్పుడో ఒకసారి తినే ప్రయత్నం చేయొచ్చు.
ఇవే కాకుండా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కోడిగుడ్డు తీసుకోవడం వల్ల ఎంతో మంచిది. ఇందులో అనేక రకాల ప్రోటీన్లు ఉంటాయి. అంతేకాకుండా తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీంతో శరీరానికి ఏ విధంగానో అలసట లేకుండా శక్తిని ఇస్తుంది.