Homeహెల్త్‌Spicy Food Health Benefits: కారం మరణ రేటును తగ్గిస్తుందా? ఇందులో నిజం ఎంత?

Spicy Food Health Benefits: కారం మరణ రేటును తగ్గిస్తుందా? ఇందులో నిజం ఎంత?

Spicy Food Health Benefits: అబ్బో మేము అసలు కారం తినము. కారం అసలు తినవద్దు. తింటే ఆరోగ్యానికి అసలు మంచిది కాదు అని చాలా మంది అంటారు. కానీ మరికొందరు మాత్రం మాకు అయితే కచ్చితంగా కారంగా ఉంటేనే తినాలి అనిపిస్తుంది. సప్పగా ఉంటే అసలు నచ్చదు అని కొందరు అంటారు. ఉప్పు కారం బాగా తింటేనే శరీరం దృఢంగా ఉంటుంది అని మరి కొందరు అంటారు. ఇంతకీ మీ వంటగదిలో ఉంచిన చిన్న మిరపకాయ మీ ఆహారానికి కారాన్ని అందిస్తుంది కానీ ఆరోగ్యాన్ని అందిస్తుందా? మీ ఆరోగ్యంలో కూడా పెద్ద మార్పులను తీసుకువస్తుందా? అంటే అవును, చాలా మంది స్పైసీ ఫుడ్ తినకుండా ఉంటారు. కానీ ఇటీవలి కొన్ని పరిశోధనలు స్పైసీ ఫుడ్ తినే వ్యక్తులు అనారోగ్యానికి తక్కువ గురి అవుతారు అని తెలిసింది. వారి మొత్తం ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని సమాచారం. మరి దాని గురించి వివరంగా తెలుసుకుందామా?

మరణ ప్రమాదం తగ్గుతుంది
2020 సంవత్సరంలో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, మిరపకాయలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. తక్కువ కారం తినేవారి కంటే ఎక్కువ కారం తినే వారికి అకాల మరణం వచ్చే ప్రమాదం 25 శాతం తగ్గుతుంది అంటుంది అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమైన అధ్యయనం.

రక్తంలో చక్కెర నియంత్రణ
ఈ ప్రయోజనాలకు ‘క్యాప్సైసిన్’ అనే ప్రత్యేక మూలకం కారణమని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన సీనియర్ రచయిత, కార్డియాలజిస్ట్ డాక్టర్ బో జు విశ్వసిస్తున్నారు. క్యాప్సైసిన్ మిరపకాయకు దాని కారంగా ఉండే రుచిని ఇస్తుందట. ఇది మన శరీరంలోని నాడీ కణాలలో TRPV1 అనే గ్రాహకాలను సక్రియం చేస్తుంది అంటున్నారు నిపుణులు. ఈ గ్రాహకాలు అడ్రినలిన్ హార్మోన్‌ను పెంచుతాయి. ఇది శరీరంలోని కొవ్వును కాల్చడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Also Read:  Chilli Powder: స్సైసీ కోసం ఎర్రకారం ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే

రోగనిరోధక వ్యవస్థ
దీనితో పాటు, కొన్ని పరిశోధనలు కూడా TRPV1 అతి చురుకైన రోగనిరోధక కణాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని చూపిస్తున్నాయి. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బులు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారణం. అంతే కాదు, స్పైసీ ఫుడ్ మన పేగు ఆరోగ్యానికి కూడా మంచిది . ఇది మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాదు “స్పైసీ ఫుడ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది అంటున్నారు నిపుణులు. దీని వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుందని, బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది” అని అన్నారు.

కారంగా ఉండే ఆహారం తినడం ఎలా ప్రారంభించాలి?
మీ ఆహారంలో కారంగా ఉండే పదార్థాలను పెంచుకోవాలనుకుంటే , నెమ్మదిగా ప్రారంభించడం మంచిది. మీరు కారంగా ఉండే ఆహారాలకు అలవాటుపడకపోతే, ముందుగా పోబ్లానో (తక్కువ కారంగా ఉండేవి) వంటి తేలికపాటి మిరియాలతో ప్రారంభించండి. మీరు క్యాప్సైసిన్ ఉన్న ఆహారాన్ని తినేటప్పుడు, మీ సహనం పెరుగుతుంది. మీరు కాస్త కారంగా ఉండే మిరియాలను ఎంచుకున్నా ఒకే. మంచి ఫలితాలు ఉంటాయి. అదనంగా, మీరు వారానికి 2-4 సార్లు కారంగా ఉండే ఆహారాన్ని తినాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular