Plastic: ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఎంతో మంది ఈ ప్లాస్టిక్ గురించి భయబ్రాంతులకు గురి అవుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న అంశం ప్లాస్టిక్. రోజురోజుకీ పెరిగిపోతుంది కూడా ఈ ప్లాస్టిక్. ప్లాస్టిక్ వాడకం కారణంగా పర్యావరణం కాలుష్యం అవుతున్న విషయం తెలిసిందే. విపరీతమైన ప్లాస్టిక్ వాడకంతో సముద్రాలు, నదులు కలుషితంగా మారుతున్నాయి. ఏళ్లపాటు భూమిలో కలిసిపోని ప్లాస్టిక్ ఎన్నో వ్యాధులకు దారి తీస్తుంది అంటున్నారు నిపుణులు. అయితే తాజాగా పరిశోధనల్లో వెల్లడైన అంశాల గురించి పరిశోధకులు తెలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ షాకింగ్ విషయాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. మనిషి శరీరంలోకి ప్లాస్టిక్ ప్రవేశించడం ఇప్పుడు షాకింగ్‌కి చాలా డేంజర్ అవుతుంది అంటున్నారు.
మానవ ఊపిరిత్తులు, మెదడులో మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు కనపించాయట. దీంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు ఉలిక్కిపడుతున్నారు. మానవ శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ రూపంలో ప్లాస్టిక్ అవశేషాలు ప్రవేశిస్తున్నాయి అంటున్నారు నిపుణులు. మైక్రోప్లాస్టిక్స్‌పై ఇప్పటి వరకు జరిగిన 7వేలకి పైగా అధ్యయనాల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడవడంతో ఇప్పటికీ అయినా జాగ్రత్త అవసరం అంటున్నారు నిపుణులు. సైన్స్ మ్యాగజైన్ ప్రకారం.. గత రెండు దశాబ్దాల సంవత్సరాలుగా, , అడవి జంతువులతో పాటు మానవు శరీరంలో కూడా ఎన్నో మైక్రోప్లాస్టిక్ కణాల ఉనికిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. మానవ శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ ఆహారం, డ్రింక్స్ రూపంలో ప్రవేశిస్తుందట. ఇదిలా ఉంటే ఇంత పెద్ద మొత్తంలో మానవ శరీరంలోకి అసలు ప్లాస్టిక్ ఎలా వస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగడం, ఇతర ప్యాకేజీంగ్ పదార్థాల కోసం ప్లాస్టిక్‌ను ఎక్కువగా ఉపయోగించడం, ప్లాస్టిక్స్ కవర్స్‌ను ఉపయోగించడం, కూడా ఇందుకు కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఈ వినియోగాన్ని తగ్గించాలని హెచ్చరిస్తున్నారు.
ఇక బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల కూడా ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయట. ముఖ్యంగా ఫేస్ వాష్, బాడీ లోషన్, టూత్‌పేస్ట్ వంటి అనేక సౌందర్య ఉత్పత్తులు మైక్రోప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి అంటున్నారు పరిశోధకులు. సింథటిక్ బట్టలను ఉతికే సమయంలో చిన్న మైక్రోప్లాస్టిక్ ఫైబర్‌లను విడుదల చేస్తుంటాయి. ఇవి నీటి ద్వారా పర్యావరణంలో చేరుతుంటాయి. అంతేకాదు ఎన్నో పరిశ్రమల నుంచి ఉత్పత్తయ్యే వ్యర్థాల్లో మైక్రోప్లాస్టిక్‌లు ఉంటున్నాయి. ఇవన్నీ విభిన్న మార్గాల్లో మనిషి శరీరంలోకి ప్లాస్టిక్ వెళ్లడానికి కారణం అవుతున్నాయి.
నివారణ ఎలా?
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని ఎక్కడ అమ్మకుండా చర్యలు తీసుకోవాలి అధికారులు. కానీ ప్లాస్టిక్ ను నిషేధించిన కూడా ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా ప్లాస్టిక్ కవర్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అమ్మకాలు జరిపుతూ పట్టుబడితే వారి కమర్షియల్ లైసెన్సులను రద్దు చేసే అవకాశం ఉన్నా సరే భయంగా ఉండటం లేదు వ్యాపారస్థులు. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ సంచులను సింగిల్ యూజ్ ప్లాస్టి క్‌గా పరిగణిస్తారు. అంటే రోజూ మనం వాడి పారేసే స్ట్రాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ సంచులు, సోడా బాటిళ్లు, ప్లేట్లు, కప్పులు, ఆహారం ప్యాకేజీ కంటెయినర్లు, వంటివి మొత్తం ఈ జాబితాలోకి వస్తాయి. అందుకే ఎవరికి వారే వీటిని బ్యాన్ చేయాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు..