Viswam’ movie review : గోపీచంద్ ‘విశ్వం’ మూవీ మొట్టమొదటి రివ్యూ..గోపీచంద్ హిట్ కష్టాలు ఇక తీరినట్టేనా?

ప్రస్తుతం కామెడీ జానర్ సినిమాలు తక్కువ అవ్వడంతో ఈ సినిమా ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని అంటున్నారు, ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

Written By: Vicky, Updated On : October 6, 2024 7:15 pm

Gopichand's 'Viswam' movie first review

Follow us on

Viswam’ movie Review :  స్టార్ హీరో అయ్యేందుకు అన్ని రకాల అర్హతలు ఉన్నపటికీ కూడా సమయం కలిసి రాకపోవడం తో ఇప్పటికీ మీడియం రేంజ్ హీరో గా మిగిలిపోయిన నటుడు గోపీచంద్. విలన్ గా మంచి పాపులారిటీ ని సంపాదించిన ఆయన ‘యజ్ఞం’ సినిమాతో హీరోగా మారి మొట్టమొదటి కమర్షియల్ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మాస్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న గోపీచంద్ ఆ తర్వాత లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడంతో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. దీంతో గోపీచంద్ కెరీర్ రిస్క్ లో పడింది. మార్కెట్ మొత్తం పోయింది. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘భీమా’ చిత్రం మంచి రివ్యూస్ ని తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది.

ఇప్పుడు ఆయన ‘విశ్వం’ చిత్రం తో మన ముందుకు రాబోతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ఇటీవలే కొంతమంది బయ్యర్స్ కి వేసి చూపించారట. వాళ్ళ నుండి ఈ సినిమాకి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీను వైట్ల స్ట్రాంగ్ జోన్ కామెడీ అనే సంగతి అందరికీ తెలిసిందే. కామెడీ కి కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి సూపర్ హిట్ ని అందుకోవడం ఆయన స్టైల్. అయితే ఈ ఫార్ములా ఇప్పుడు నాసిరకం అయిపోయింది. శ్రీను వైట్ల సినిమాలు జనాలకు బోర్ కొట్టేశాయి. అందుకే ఆయన పదేళ్ల నుండి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రాన్ని లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టుగా తన మార్కు కామెడీ తో తెరకెక్కించాడని తెలుస్తుంది. స్పై జానర్ లో సాగే ఈ చిత్రంలో గోపీచంద్ మార్క్ యాక్షన్ సన్నివేశాలు, శ్రీను వైట్ల మార్క్ కామెడీ టైమింగ్ తో పాటు సెంటిమెంట్ సన్నివేశాలు కూడా బాగా కుదిరినట్టు తెలుస్తుంది. శ్రీను వైట్ల కెరీర్ లో వెంకీ చిత్రం ఎంతో ప్రత్యేకం.

ఇందులో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ‘విశ్వం’ చిత్రం లో కూడా ట్రైన్ ఎపిసోడ్ ఆ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడట. రొటీన్ గా అనిపించకుండా ఆయన రాసిన ఈ ట్రైన్ సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ చిత్రం ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించే సినిమా అవుతుందని, శ్రీను వైట్ల మరియు గోపీచంద్ ఇద్దరికీ మంచి కం బ్యాక్ అయ్యే చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం కామెడీ జానర్ సినిమాలు తక్కువ అవ్వడంతో ఈ సినిమా ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని అంటున్నారు, ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.