Planning For Second Child : రెండో బిడ్డకు ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

రెండో బిడ్డకు జన్మనివ్వాలని ప్లాన్ చేస్తుంటే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలోకి ఒక మనిషి అదనంగా వస్తే చాలా ఖర్చులు పెరుగుతాయి. అందులోనూ చిన్నపిల్లలు అంటే అదనపు ఖర్చు ఉంటుంది. కాబట్టి వీటి కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. పుట్టే పిల్లలకు బట్టలు, పాలు, మందులు, డైపర్‌లు ఇలా అన్నింటికి ఖర్చులు ఉంటాయి.

Written By: Srinivas, Updated On : August 25, 2024 7:06 pm

planning for second child

Follow us on

Planning For Second Child :  అమ్మతనం అనేది ఒక వరం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి పుట్టబోయే బిడ్డ గురించి చాలా ఆలోచిస్తారు. వాళ్ల కోసం ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈరోజుల్లో చాలా మంది ఒక బిడ్డను కన్న తర్వాత వెంటనే మరొకరిని కనేందుకు సిద్ధమవుతున్నారు. కొంతమంది ఒక బిడ్డతోనే ఆగిపోతున్నారు. కుటుంబంలోకి పుట్టిన బిడ్డ వచ్చినట్లయితే చాలా మార్పులు వస్తాయి. వీటిని తల్లిదండ్రులు ముందే తెలుసుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక బిడ్డ ఉన్న తర్వాత వెంటనే ఇంకో బిడ్డకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా చేయడం మంచిదే. కానీ ఒక సంతానం తర్వాత మళ్లీ వెంటనే బిడ్డ పుడితే చాలా సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. రెండో బిడ్డకు ప్లాన్ చేసేముందు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.

రెండో బిడ్డకు జన్మనివ్వాలని ప్లాన్ చేస్తుంటే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలోకి ఒక మనిషి అదనంగా వస్తే చాలా ఖర్చులు పెరుగుతాయి. అందులోనూ చిన్నపిల్లలు అంటే అదనపు ఖర్చు ఉంటుంది. కాబట్టి వీటి కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. పుట్టే పిల్లలకు బట్టలు, పాలు, మందులు, డైపర్‌లు ఇలా అన్నింటికి ఖర్చులు ఉంటాయి. ముందుగానే వీటి లెక్కలు వేసుకోవాలి. లేకపోతే మీతో పాటు పుట్టే బిడ్డ కూడా ఇబ్బంది పడుతుంది. మొదటి కాన్పు తర్వాత మహిళలు చాలా నీరసం అవుతారు. అంతగా పనులు చేయలేరు. శారీరకంగా ఇబ్బంది పడతారు. కాబట్టి శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉన్నారో లేదో తెలుసుకోవాలి. అప్పుడే రెండో బిడ్డకు ప్లాన్ చేసుకోవాలి.

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా తప్పనిసరి. ఎందుకంటే ఈ మానసికంగా మీరు ఇబ్బంది పడితే ఆ ప్రభావం బిడ్డపై పడుతుంది. పుట్టే బిడ్డకు కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మొదటి బిడ్డకు రెండో బిడ్డకు గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఇద్దరి మధ్య అభిమానం, ఆప్యాయతలు ఉంటాయి. గ్యాప్ వల్ల తల్లికి కూడా ఈజీగా ఉంటుంది. లేకపోతే వరుసగా వెంట వెంటనే కాన్పులు అయితే ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలకు తోడు అవసరం. చాలామంది ఈరోజుల్లో ఒక బిడ్డతో ఆగిపోతున్నారు. కానీ తోబుట్టువులు ఉండాలి. వాళ్లకు ఏదైనా సమస్య వస్తే వేరే వాళ్లతో షేర్ చేసుకోలేరు. తోబుట్టువులతో అయితే షేర్ చేసుకోగలరు. ఇంట్లో వాళ్లతో పాటు ఆడుకోవడానికి ఎవరూ ఉండరు. దీంతో వాళ్లకి ఒంటరి అనే భావన వస్తుంది. భవిష్యత్తులో అందరితో కలవలేరు. బయటకు వెళ్లలేరు. కాబట్టి రెండో బిడ్డను ప్లాన్ చేసుకోండి. కానీ మొదటి బిడ్డకు కొంచెం గ్యాప్ తర్వాత మాత్రమే ప్లాన్ చేసుకోండి.